Don't Miss!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య కొడతాడు గాని.. మెగా ఫ్యామిలీ లాగా కాదు: బర్త్ డేపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్
వివాదాల సుందరి శ్రీ రెడ్డి బాలకృష్ణ పుట్టినరోజున ఒక స్పెషల్ కామెంట్ తో ఓ వర్గం నెటీజన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే ఆమె ఎలాంటి విషయం గురించి స్పందించినా కూడా మెగా ఫ్యామిలీని మాత్రం టార్గెట్ చేయకుండా వదిలిపెట్టడం లేదు. నేడు బాలకృష్ణ బర్త్ డే కావడంతో ప్రతి ఒక్కరు ఆయనకు స్పెషల్ గా బర్త్ విషెస్ అందిస్తున్నారు. అయితే శ్రీ రెడ్డి మాత్రం అంతకంటే డిఫరెంట్ గా విష్ చేసింది.
Recommended Video
శ్రీ రెడ్డి విషెస్..
శ్రీ రెడ్డికి సోషల్ మీడియాలో ఈ వర్గం నుంచి బాగనే రెస్పాన్స్ వస్తోంది. రోజురోజుకి వివాదాల డోస్ పెంచేలా కామెంట్ చేస్తోంది. ఓ వర్గం హీరో అభిమానులను రెచ్చగొట్టేలా కామెంట్ చేస్తూ మరో హీరో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తోంది. నిత్యం ఎదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి నేడు బాలకృష్ణకు తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
పద్మ శ్రీ అవసరం లేదు..
ఇండస్ట్రీ సింహా స్వప్న, నట రత్న, తెలుగు ప్రియ.. మంచి మానవత్వం ఉన్న సోషల్ సర్వీస్.. ఆయనకు పద్మ శ్రీ అవసరం లేదు. ఆయన నవ్వే ఒక పెద్ద అవార్డ్. లివింగ్ లెజెండ్ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలుపుతూ.. ఆయన వ్యక్తిత్వం గురించి శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. అలాగే తన పోస్ట్ లో మెగా ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేశారు.
మెగా ఫ్యామిలీపై కామెంట్..
ప్రేమతో చెంప మీద కొడతావ్ తప్ప.. మెగా ఫ్యామిలీ లాగా కడుపు మీద కొట్టడు ఈ బంగారు కొండ. పేద ప్రజల ఆకలి, ఆరోగ్యం గురించి ఆలోచించే ముద్దుల మామయ్య మా బాలయ్య అంటూ శ్రీ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలయ్య స్మైల్..
అలాగే బాలయ్యకు సంబంధించిన ఒక స్మైల్ టిక్ టాక్ వీడియోను కూడా శ్రీ రెడ్డి సోషల్ మిడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ పుట్టినరోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో చాలానే ట్రెండ్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా బాలయ్యపై వారికున్న అభిమానాన్ని, ప్రేమను ట్వీట్స్ ద్వారా తెలియజేశారు.