నువ్వెంత నీ బతుకెంత.. కడుపు చేస్తావా?.. మరోసారి బుతులతో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి!
టాలీవుడ్ కాంట్రవర్సీ గర్ల్ శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా లైవ్ లో తీవ్ర ఆగ్రహంతో దర్శనమిచ్చింది. మొన్నటివరకు శ్రీ రెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. దగ్గుబాటి ఫ్యామిలీ సంబంధించిన ఏ మ్యాటర్ హాట్ టాపిక్ అయినా కూడా ఆ మ్యాటర్ పై కౌంటర్స్ వేయడం అలవాటే.. మొన్న రానా దగ్గుబాటి పెళ్లి వేడుకలు మొదలవ్వడంతో శ్రీ రెడ్డి కామెంట్స్ డోస్ కూడా పెంచింది. ఇక ఇటీవల డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పై కూడా సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.

శ్రీ రెడ్డి vs రాకేష్ మాస్టర్
శ్రీ రెడ్డికి రాకేష్ మాస్టర్ కి గత కొన్నాళ్లుగా ఇంటర్వ్యూల ద్వారా వార్ జరుగుతూనే ఉంది. చాలా ఇంటర్వ్యూలలో ఒకరినొకరు దూషించుకోవడం మీడియాలో వైరల్ అయ్యింది. ఇక కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు అనుకునే లోపే మళ్ళీ ఊహించని మాటలతో షాకిచ్చారు. ముఖ్యంగా శ్రీ రెడ్డి చెప్పలేని స్థాయిలో బుతులతో రెచ్చిపోయి రాకేష్ మాస్టర్ గురించి కొన్ని విషయాలని చెప్పింది.

ఏమైందంటే..
సీనియర్ డ్యాన్స్ మాస్టర్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన డ్యాన్స్ మాస్టర్ రాకేష్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో యూ ట్యూబ్ ద్వారా జనాలను ఎట్రాక్ట్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో సమజాసేవ అంటూ కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేశారు. అలాగే స్టార్ హీరోలపై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన శ్రీ రెడ్డిపై కామెంట్స్ చేయడంతో మళ్ళీ పాత వివాదం మొదటికి వచ్చింది.

పగలగొడతా..
ఒక ఇంటర్వ్యూలో బీర్ తాగుతూ శ్రీ రెడ్డి నాకు భయపడిందని, ఇంట్లోనే ఉండి వంట చేసుకుంటోందని కామెంట్ చేయడంతో శ్రీ రెడ్డి ఊహించని విదంగా కామెంట్ చేసింది. నీకు భయపడేది ఏంట్రా? శ్రీ రెడ్డి గురించి నీకు చాలా తక్కువ తెలుసు. నేను హైదరాబాద్ లోనే ఉన్నా.. ఏం పగలగొడతానో నాకే తెలియదు అంటూ రాకేష్ మాస్టర్ పై విరుచుకుపడింది.
Recommended Video

కడుపు చేస్తావా?
అంతే కాకుండా నువ్వు గురువువా? పురుగువా? అంటూ ఆడపిల్లలకు కడుపు చేస్తావా? నిన్ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా గెంటేశారుగా అంటూ నువ్వేంత నీ బతుకెంత.. జాగ్రత్త.. అని శ్రీ రెడ్డి లైవ్ ఫేస్ బుక్ లో వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా నువ్వు ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో.. అంటూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో అని శ్రీ రెడ్డి ఫీనిషింగ్ టచ్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











