Sri Reddy Vs Shyamala: యాంకర్ శ్యామలపై నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి.. మూతి వంకర అందగత్తె అంటూ!

తెలుగు సినిమా దగ్గర ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలు కొత్తేమి కాదని అందరికీ తెలిసిందే. కాగా ఇవి ఒకప్పుడు సినిమా పరంగా కొందరు నటీనటుల విషయంలో ఉండేవి కానీ ఇప్పుడు రాజకీయాలు కూడా తోడయ్యాయి. దీనితో ఒకప్పుడు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనే మాట పక్కకి వెళ్లి రెండూ మిళితం అయ్యిపో సాగాయి. కాగా మన తెలుగు సినిమా సహా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా వాళ్ళ పేర్లు బాగా వినిపించడం మొదలవుతున్నాయి.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి సంబంధించి చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకి దగ్గర సంబంధం ఉన్న వారు కూడా ఉన్నారు. ఇలా టాలీవుడ్ కి చెందిన ఓ కాంట్రవర్సియల్ నటి శ్రీ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో ఆమె రేపిన సంచలనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఆమె పాపులర్ అయ్యింది.

sri reddy shocking post on anchor ycp spokesperson shyamala

కాగా అక్కడ నుంచి ఆమె సినిమాలు పక్కన పెట్టి అడల్ట్ కంటెంట్ తో సోషల్ మీడియాలో చాలామంది సినీ రాజకీయ నాయకులపై కామెంట్స్ చేస్తూ వచ్చింది. అయితే ఆమె ఏపీలో ఒకప్పుడు అధికార పార్టీ వైసీపీకి పని చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అప్పుడు పవర్ లో ఉన్న వైసీపీ బలంతో మరింత స్థాయిలో రెచ్చిపోయింది. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయ్యేసరికి నెమ్మదిగా తనలోని మాటలు చెబుతుంది.

ఇలా తనకి తనలాంటి ఎంతోమందికి వైసీపీలో జరుగుతున్నా అన్యాయాలు కోసం సోషల్ మీడియాలో చెబుతుంది. కాగా ఇటీవల టాలీవుడ్ కి తెలుగు బుల్లితెరకు బాగా పరిచయం అయ్యిన గ్లామరస్ బ్యూటీ యాంకర్ శ్యామల వైసీపీకి అధికార ప్రతినిధిగా నియమించబడ్డ సంగతి తెలిసిందే. మరి ఈమెపై అలాగే ఈమె విషయంలో తీసుకున్న నిర్ణయంపై శ్రీ రెడ్డి ఫైర్ అయ్యింది.

sri reddy shocking post on anchor ycp spokesperson shyamala

"అదృష్టం అంటే ఈమెదే... ఏమీ పార్టీ కోసం పని చెయ్యకపోయినా అందలం ఎక్కించారు. జై వైఎస్సార్సీపీ, బెదిరింపులు, తిట్లు ఏమో మాకు పోస్టింగులు, ప్రెస్ మీట్ లు మూతి వంకర అందగత్తెలకి" అంటూ శ్రీరెడ్డి యాంకర్ శ్యామల ఫోటో పెట్టి డైరెక్ట్ గానే అటాక్ చేసింది. దీనితో ఈ షాకింగ్ పోస్ట్ వైరల్ గా మారింది. దీనితో ఈమె విషయంలో శ్రీరెడ్డి బాగా హర్ట్ అయ్యిందని చెప్పాలి.

ఇటీవల ఎన్నికల సమయంలోనే యాంకర్ శ్యామల చేసిన చేసిన పలు కాంట్రవర్సియల్ కామెంట్స్ తో బాగా వైరల్ అయ్యింది. కానీ ఫలితాలు తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఓ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమె కనిపించడం మొదలు పెట్టింది. తనకి కూడా ఆ మధ్య బెదిరింపులు వస్తున్నాయి అని..

ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఇవ్వడం ఆపేశారని యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ఆమెని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని పలు రూమర్స్ ఆ మధ్య వచ్చాయి. అంతే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా శ్యామలకి అవకాశాలు ఇచ్చేది లేదని కూడా టాక్ వచ్చింది. సో అవన్నీ పోగొట్టుకుని ఫైనల్ గా అధికార ప్రతినిదిగా ఆమె సెటిల్ అయ్యిపోయింది. కానీ ఇలా సెట్టయ్యాక కూడా ఆమె పార్టీ నుంచే అది కూడా మహిళ నుంచే ఘాటు విమర్శలు ఎదుర్కోవడం అనేది గమనార్హం.

More from Filmibeat

Read more about: sri reddy anchor shyamala ycp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X