ఒళ్లంతా అలా నింపేసింది.. వివాదానికి తెరలేపిన శ్రీ రెడ్డి వీడియో
వివాదాలకు కేంద్ర బిందువులా ఉండే నటి శ్రీరెడ్డి. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఇక నోటి వెంట మాట వచ్చిందంటే.. ఎవరికో మూడినట్టే. దాదాపు చాలా రోజుల నుంచి మౌనంగా ఉంటూ వస్తున్న శ్రీరెడ్డి గత వారం రోజుల నుంచి మళ్లీ తన విశ్వరూపం చూపించింది. దారుణమైన మాటలతో, రాయడానికి వీల్లేనటు వంటి పదజాలంతో రాకేశ్ మాష్టర్, కరాటే కళ్యాణిలపై విరుచుకుపడింది.

బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి..
రాకేష్ మాష్టర్ తనపై కామెంట్స్ చేశాడని.. ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి ఓ రేంజ్‌లో శివాలెత్తింది. కరాటే కళ్యాణిపైనా నోరు జారింది. ఇష్టమొచ్చినట్టు బూతులతో రెచ్చిపోయింది. హైద్రాబాద్‌లో ఉన్నాను ఏం పీకుతావ్ రా అంటూ రాకేష్ మాష్టర్‌కు సవాల్ విసిరింది. కరాటే కళ్యాణి వ్యక్తిగత విషయాలపైనా కామెంట్ చేసింది.

శ్రీరెడ్డిపై కేసులు..
తనపై అసభ్యకర కామెంట్స్ చేయడం, సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టుగా దూషించడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. తాను చట్టపరంగా వెళ్తానని, ఆమెలా నోరు పారేసుకోనని ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించింది.

మహాశివరాత్రి సందర్భంగా..
ఈ వివాదాలన్నీ కాసేపు పక్కన పెడితే.. శ్రీరెడ్డి ప్రస్తుతం సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్‌ను పెట్టుకుంది. దాంట్లో వంటలకు సంబంధించిన చిట్కాలు, వీడియోలు పోస్ట్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది. రెండు మూడు తమిళ సినిమాలు కూడా చేతిలో ఉన్నాయి. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ప్లాన్ చేసి కొత్త అవతారమెత్తింది.
Recommended Video


శివుడిగా, అఘోరాగా..
ఆ కాన్సెప్ట్‌లో శ్రీ రెడ్డి అఘోరాగా, శివుడిగా, భక్తురాలిగా వింత వింత పాత్రలను పోషించింది. ఇక అఘోరా, శివుడి గెటప్‌లో శ్రీరెడ్డి చేసిన యాక్షన్ చూస్తే తల పట్టుకోవాల్సిందే. ఆ పిచ్చి పిచ్చి గంతులను ఏమనుకోవాలో ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఈ వీడియో కూడా కాంట్రవర్సీగా మారేట్టు ఉంది. తన యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











