ఆంధ్ర పోలీసులకు శ్రీరెడ్డి సపోర్ట్.. అదంతా డ్రామా.. బూతులు మాట్లాడుతుంటే ఎలా?
ఎప్పటికప్పుడు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్యకాలంలో చెన్నైలో సెటిల్ అయిన ఈ భామ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద స్పందిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన గురించి శ్రీ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

లాక్ డౌన్
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరగడానికి, నిత్యావసరాలు కొనుక్కోవడానికి అనుమతిస్తున్నారు. 12 గంటల తర్వాత ఎవరు కనబడినా వారి మీద చర్యలు తీసుకుంటూ, చలానాలు విధిస్తూ పోలీసులు కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్నారు.

విశాఖపట్నంలో హైడ్రామా
అయితే నిన్న విశాఖపట్నంలో ఒక జంక్షన్లో హైడ్రామా చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో పనిచేస్తున్న యువతిని తీసుకువచ్చేందుకు గాను ఆమె స్నేహితుడు బైక్ మీద వెళ్ళాడు. అయితే పోలీసులు అతన్ని ఆపడంతో అతను సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అతను బండి మీద చలానా విధించారు పోలీసులు. సదరు యువకుడు వెళ్లి తన స్నేహితురాలిని తీసుకురాగా ఆమె వచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగింది.

సోషల్ మీడియాలో వైరల్
సుమారు గంట పైగా జరిగిన ఈ వాగ్వాదం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు తనను తీసుకురావడానికి వచ్చిన వ్యక్తికి ఎలా ఫైన్ వేస్తారు అని సదరు యువతి ప్రశ్నిస్తోంది. పర్మిషన్ కాగితాలు చూపించినా సరే పోలీసులు ఫైన్ వేశారు అని ఆమె ఆరోపిస్తోంది. అయితే ఆమె వచ్చినప్పటి నుంచి ప్రవర్తన సరిగా లేదని, తమను దుర్భాషలు ఆడిందని పోలీసులు చెబుతున్నారు.
Recommended Video

అంతా డ్రామా
ఈ అంశం మీద రాజకీయంగా పెను దుమారం రేగడంతో పోలీసులు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశంలో ఇప్పుడు శ్రీ రెడ్డి పోలీసులకు సపోర్ట్ గా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. కరోనా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి పోలీసులు అలా చేశారని, సదరు యువతి డ్రామా ఆడినట్లు అందరికీ అర్థం అయిపోతుందని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులంటే అందరికీ గౌరవం ఉండాలని ప్రాణాలు పోతున్నా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు కష్టపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

తప్పంతా యువతిదే
ఈ విషయంలో తప్పంతా సదరు యువతిదే అని పేర్కొన్న శ్రీరెడ్డి ఆమె పోలీసులను అసభ్య పదజాలంతో మాట్లాడుతూ బూతులు తిట్టిందని ఈ విషయం స్వయంగా యువతే ఒప్పుకుందని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఈ విషయంలో పోలీసులకు అందరూ అండగా నిలబడి సపోర్ట్ గా ఉండాలని చెప్పుకొచ్చింది. అన్ని విషయాల్లోనూ కావాల్సి వచ్చిన పోలీసులు ఇలా ఏదైనా జరగగానే శత్రువుల్లాగా మాట్లాడటం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అని ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











