ఈ సారి మంచు లక్ష్మిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, ఫ్రెండ్స్ నీ వదలలేదు: దారుణమైన ట్రోలింగ్ !

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే ఒక భూతం ఉందని చెబుతూ తాను ఆ భూతానికి బలయ్యానని రెండేళ్ల క్రితం మీడియా ముందుకు వచ్చిన శ్రీరెడ్డి, ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని విమర్శిస్తూనే ఉంటుంది. ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే బూతులతో విరుచుకు పడి పోయే శ్రీరెడ్డి తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె, నటి, యాంకర్, నిర్మాత అయిన మంచు లక్ష్మి ని టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేసింది.

హాట్ హాట్‌గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)నిజానికి మంచు లక్ష్మి ఎక్కువగా ఇంగ్లీషు యాక్సెంట్ ఉన్న తెలుగు మాట్లాడుతుంది. ఇంగ్లీష్ తెలుగు కలగలిపిన ఓ రకమైన యాసలో మాట్లాడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దానిని ట్రోల్ చేస్తూ శ్రీ రెడ్డి వీడియో మొదలు పెట్టింది. అసలు ఎందుకు టార్గెట్ చేసిందో తెలియదు కానీ మంచు లక్ష్మి భర్త, మంచు లక్ష్మి కుమార్తెను కూడా ఉద్దేశించి శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ప్రస్తావిస్తూ ఆమె వీడియో ఆద్యంతం మంచు లక్ష్మి ని ట్రోల్ చేయడానికి ఆసక్తి చూపించింది.

Sri Reddy targets Manchu Lakshmi lifestyle and Her Relations with Celebrities

నిజానికి గతంలో శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసిన సమయంలో అలాగే క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతున్న సమయంలో మంచు లక్ష్మి శ్రీ రెడ్డి గురించి పాజిటివ్ గా స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కుదిరితే అప్పుడు శ్రీ రెడ్డి మంచు లక్ష్మి ని టార్గెట్ చేస్తోంది. మరి తాజాగా ఎందుకు టార్గెట్ చేసింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మంచు లక్ష్మి స్పూఫ్ అంటూ ఫేస్ బుక్ లో దాదాపు 11 నిమిషాల పాటు వీడియో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి మంచు లక్ష్మి ఇమిటేట్ చేస్తూ అనేక విషయాలను దారుణంగా ట్రోల్స్ చేసింది. ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X