ప్రముఖ కెమెరామెన్‌పై అర్జున్ రెడ్డి నటి ఫిర్యాదు: టాలీవుడ్‌లో మరోసారి రచ్చ లేపిన వ్యవహారం
కొద్ది నెలల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది 'అర్జున్ రెడ్డి' భామ శ్రీ సుధ రెడ్డి. ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు తనను మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. పెద్ద దుమారాన్నే రేపింది. అంతేకాదు, ఆ తర్వాత ఈ కేసు విషయంలో ఎంతగానో పోరాటం చేసింది. కొద్ది రోజులు పాటు అలా హడావిడి చేసిన ఈ తెలుగు బ్యూటీ.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. దీంతో ఈ కేసు కూడా కనుమరుగు అయిపోయింది. కానీ, అప్పుడప్పుడూ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినీ పెద్దలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంది.
చాలా గ్యాప్ తర్వాత శ్రీ సుధ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి కారణం తాజాగా ఆమె మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడమే. చోటా కె నాయుడు సోదరుడు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిపై మరోసారి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఎస్‌ఆర్ నగర్ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇక, శ్రీ సుధ ఈ సారి చేసిన ఫిర్యాదులో శ్యామ్ కే నాయుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, గతంలో చేసిన కంప్లైంట్‌కు సంబంధించిన అంశాలను కూడా జోడించారు.

శ్యామ్ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ గత మే నెలలో శ్రీ సుధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసును వెనక్కి తీసుకోవాలంటూ అతడి స్నేహితులు తనను బెదిరిస్తున్నారని ఆమె తాజాగా ఫిర్యాదు చేసింది. అంతేకాదు, ఆ కేసు విషయంలో తాను రాజీ పడినట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోర్టుకు సమర్పించారని కూడా ఆమె ఆరోపించారు. అలాగే, కంప్లైంట్ చేసి చాలా కాలం కావొస్తున్నా శ్యామ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదని ఆ ఫిర్యాదులో పోలీసులకు గుర్తు చేసింది శ్రీ సుధ రెడ్డి.


Click it and Unblock the Notifications











