twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా పోరులో దిల్ రాజు సైతం.. కొన్నాళ్ళు భరించండి అంటూ ట్వీట్ !

    |

    భారతదేశం మొత్తం పెద్ద ఎత్తున కరోనా కేసు నమోదు అవుతున్నాయి. దీంతో దేశం మొత్తం మీద కరోనా టెన్షన్ నెలకొంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు మరికొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే భయంకరంగా ఉంది. ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున సినిమా వాళ్లకు కూడా చాలా మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్ రాజు కు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

    కరోనా కారణంగా ఇక మీదట ప్లాస్మా కానీ వేరే ఇతర కరోనా అవసరాల గురించి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేస్తామని, కొన్ని రోజులు దీనిని భరించాలని కోరింది. తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి కరోనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తామని దయచేసి కొన్ని రోజుల పాటు ఇవన్నీ భరించాలని కోరింది. అయితే ఇప్పుడు దిల్ రాజు తీసుకున్న నిర్ణయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అనేక ప్రశంసలు వస్తున్నాయి. ఆయన తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ మేరకు ఇలా చేయడం అంటే ఒక రకంగా కరోనా బాధితులకు సేవ చేస్తున్నట్టే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

    Sri Venkateswara Creations of Dil Raju to share Covid related requests in social media

    నిజానికి గతంలో దిల్ రాజుకి కూడా కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది అని ప్రచారం జరిగింది. అయితే అదేమీ లేదని కొద్ది రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆయన వెల్లడించారు. ఇక సినిమాల విషయానికి వస్తే వకీల్ సాబ్ సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు ఇప్పటికే రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. మరి కొందరు టాలీవుడ్ బడా హీరోలతో సినిమాలు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

    English summary
    India has set a new global record for a rise in daily coronavirus cases for a fifth straight day, while deaths from COVID-19 also jumped by an all-time high over the last 24 hours on Monday. So Sri Venkateswara Creations of Dil Raju decided to share Covid related requests in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X