డైరెక్టర్ కామెడీ టైమింగ్ అదుర్స్.. క్రేజీగా టైటిల్ ఫస్ట్ లుక్.. తురుమ్ ఖానులు యూనిట్‌కు శ్రీవిష్ణు ప్రశంసలు
జాతి రత్నాల చిత్రం మాస్ ఆడియెన్స్‌న కాకుండా క్లాస్ ఆడియెన్స్‌ను విశేషంగా మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. అయితే అలాంటి కంటెంట్ ఫ్లేవర్ ఉన్నట్టు కనిపిస్తున్న తురుమ్ ఖాన్‌లు చిత్రం టైటిల్ ఆసక్తిని రేపుతున్నది. ఇటీవల విష్ణురిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరింత ఫీల్‌ను పెంచింది. ఆ వివరాల్లోకి వెళితే..
కేకే సినిమాస్ పతాకంపై శివకళ్యాణ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కే కళ్యాణ్‌రావు నిర్మిస్తున్న చిత్రం తురుమ్ ఖాన్‌లు. గ్రామీణ కథా నేపథ్యంగా టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన నటీనటులు నటించారు. ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. తురుమ్ ఖాన్‌లు పోస్టర్ ఐడియా చాలా సృజనాత్మకంగా ఉంది, డైరెక్టర్ శివకళ్యాణ్ నాకు ఐదేళ్ల నుంచి తెలుసు. నా సినిమాలకు కూడా వర్క్ చేశాడు. తనతో నేను సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. శివకల్యాణ్ రైటింగ్, కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. తురుమ్ ఖాన్‌లు సినిమాతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్‌గా నిలబడతాడని ఖచ్చితంగా చెప్పగలను. చిత్ర యూనిట్‌కి, ప్రొడ్యూసర్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

డైరెక్టర్ శివకళ్యాణ్ మాట్లాడుతూ... బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి గొడవపడుతూ లలిత, భారతి, పద్మని చేరుకునేందుకు ఆరాటపడుతుంటారు. కానీ అక్కడే పుట్టిన శ్రీకృష్ణుడు ఆ చిక్కుముడిని ఎలా విప్పాడనే ఈ చిత్ర కథ. మా తురుమ్ ఖాన్‌లు, డార్క్ హ్యూమర్ జానర్‌తో వస్తున్నది. ఈ చిత్రం అందరిని అలరిస్తుంది. పోస్టర్ విడుదల చేసిన శ్రీ విష్ణు గారికి థాంక్స్ అని అన్నారు.
నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్ సింగం, బాస్కర్ కర్నాటి, లక్ష్మణా చారి తదితరులు
కెమెరా: చరణ్ అంబటి
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
మ్యూజిక్: గగన్ కేఎస్
నిర్మాత: కె: కళ్యాణ్ రావు
రచన, దర్శకత్వం: శివకళ్యాణ్


Click it and Unblock the Notifications











