జాన్వీ కపూర్ కు దారుణంగా అన్యాయం.. కొరటాలను చీల్చి చెందతున్న శ్రీదేవి ఫ్యాన్స్
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిన మూవీ 'దేవర'భారీ అంచనాలతో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేండ్ల తరువాత జూ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ భారీ బడ్జెట్ మూవీ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే.. ఎన్నో అంచనాలతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాత్ర పై మాత్రం అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడుకు డైరెక్టర్ కొరటాల శివ తీవ్ర అన్యాయం చేస్తున్నారని శ్రీదేవి ఫ్యాన్స్ చీల్చి చెండాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో? మీరూ కూడా ఓ లూక్కేయండీ.
సిని ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ' దేవర ' మానియా కొనసాగుతోంది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడంతో గతంలో ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. అంచనాలకు తగ్గట్టుగానే..కొరటాల శివ దర్శకత్వంలో దేవర హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ.. ఇచ్చిన అనిరుధ్ ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్..

ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ నటించారు. డైరెక్టర్ కొరటాల డైరెక్షన్, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ డూయల్ రోల్ లో తన నట విశ్వరూపాన్ని చూపించారు. తన స్టామినా ఏంటో ఎన్టీఆర్ మరో సారి నిరూపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తొలి రోజే దాదాపు రూ.170 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమా మిక్స్‌డ్ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే భారీ వసూళ్లతో టాప్ గా నిలిచింది.
ఇక దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఈ మూవీలో జాన్వీ కపూర్ తంగం అనే పల్లెటూరి పిల్లా పాత్రలో సందడి చేసింది. కానీ, దేవర పార్ట్ 1 మూవీలో జాన్వీ కపూర్ 20 నిమిషాల కన్నా ఎక్కువ కనిపించలేదు. ఇక చెప్పాలంటే.. అసలు ఫస్టాఫ్‌లో జాన్వీ జాడ లేదు. సెకండ్ హాఫ్ లో తంగం గా చలాకీగా కనిపించిన జాన్వీ కపూర్. ఒక్క చుట్టమల్లే సాంగ్ లో దుమ్మురేపింది. క్యారక్టర్ లెంగ్త్ తక్కువగానే ఉన్నా.. ప్రేక్షకులందరీకి గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది జాన్వీ.

అయితే.. దేవర పార్ట్ 1 లో దర్శకుడు హీరో ఎలివేషన్స్, యాక్షన్ మీద ఫోకస్ చేయడంతో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ట్రాక్ కి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదనే చెప్పాలి. జాన్వీ కపూర్ కి పెద్దగా స్క్రీన్ టైం లేదు. పైగా ఉన్న సీన్స్ లో కూడా ఆమె నటన ఎలివేట్ కాలేదు. ఆమె గ్లామర్ కు తప్పించి.. నటనకు పెద్దగా స్కోప్ రాలేదని, అలాగే... జాన్వీ కపూర్ సీన్స్, ఓ పాట అంటే దాదాపు ఏడు నిముషాల దాకా కట్ చేసారని టాక్. దీంతో ఎన్నో అంచనాలతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పాత్ర పై మాత్రం అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఈ మూవీ వల్ల తనకు అన్యాయం జరిగిందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఆ పాటలో తప్పిస్తే మిగతా అంతా 10 - 15 నిమిషాలు మాత్రమే కనిపించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీది గెస్ట్ రోల్ లా అంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడుకు డైరెక్టర్ కొరటాల శివ తీవ్ర అన్యాయం చేస్తున్నారని శ్రీదేవి ఫ్యాన్స్ చీల్చి చెండాడుతున్నారు. అందాల తార శ్రీదేవి కూతురైన జాహ్నవికి తొలి తెలుగు మూవీనే ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఇచ్చి అవమానించారా? ఇంతకీ జాన్వీ ఈ క్యారెక్టర్ ను ఎలా ఒప్పుకుంది? బోని కపూర్ కు ఈ దేవర కథ ఎలా నచ్చింది ? ఎన్నో ఆశలతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన జాన్వీకి అన్యాయం జరిగిందనీ, ఇది ఆమెను ఘోరంగా అనుమానించడమే అంటూ కొందరు శ్రీదేవి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది. ఈ కామెంట్స్ పై దేవర టీమ్ ఎలా స్పందిస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











