’నాకు ఆ కులపిచ్చి ఎక్కువే .. క్యాస్ట్ ఫీలింగ్ జిందాబాద్‘

చేతికి మైక్ దొరికిందంటే చాలు.. పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే బ్యాచ్ ఒకటి అన్ని రంగాల్లో ఉంటుంది. ఈ కోవకే వస్తారు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తన విలక్షణ నటనతో మెప్పిస్తున్నారు శ్రీకాంత్. చాలా త్వరగానే తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నటుడిగా నిలిచారాయన. శ్రీకాంత్ మైక్ అందుకున్నారంటూ ఊగిపోతారు. ఎవరిని వాయించేస్తారో? ఏం మాట్లాడతారో తెలియదు. తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఎప్పుడో 2005లో ది అంగ్రెజ్ అనే సినిమాతో శ్రీకాంత్ వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ దాదాపు 8 ఏళ్ల పాటు తెరకు దూరంగా ఉన్నారు. 2013లో చమ్మక్ చల్లోతో రీ ఎంట్రీ ఇచ్చి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఏడాది ఏడు , ఎనిమిది సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నిలిచారు శ్రీకాంత్ అయ్యంగార్. ముఖ్యంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన సినిమాలకు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే హత్య, రాచరికం, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్.. మరికొన్ని సినిమాలలో నటిస్తున్నారు.

Srikanth Iyengar made controversial comments on caste

నటుడే కాదు శ్రీకాంత్‌లో దర్శకుడు కూడా ఉన్నాడు. స్టేల్‌మెట్.. ఇట్స్ యువర్ మూవ్, ఏప్రిల్ ఫూల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. వెండితెరతో పాటు ఓటీటీలలోనూ శ్రీకాంత్ అయ్యంగార్‌కు మంచి డిమాండ్ ఉంది. 11th హావర్, గేమ్, ది బేకర్ అండ్ ది బ్యూటీ, సేవ్ ది టైగర్స్ వంటి వెబ్‌సిరీస్‌లలో ఆయన నటించారు. తెరపై నట విశ్వరూపం చూపించే శ్రీకాంత్ వేదికలపై మైక్ అందుకున్నారంటే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. గతేడాది చివరిలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

1980వ దశకంలో తెలంగాణ గ్రామాల్లోని పటేళ్ల ఆగడాలు, మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత వంటి అంశాల ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన పొట్టేల్ సినిమాలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో భాగంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా రివ్యూయర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా ** లు అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఎవరున్నా లేకపోయినా ప్రేక్షక దేవుళ్లు ఉన్నారని.. వాళ్లే సినిమాను తీసుకెళ్తారని శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో పాటు రివ్యూయర్లు నిరసనకు దిగారు.

ఈ వివాదం సద్దుమణగ్గా.. తాజాగా కులం, క్యాస్ట్ ఫీలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ అయ్యంగార్. ఈ మేరకు ఓ వీడియో వదిలిన ఆయన అందులో .. చాలా మంది మీ కులమేంటీ? మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అని అడుగుతున్నారని చెప్పారు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది.. కులం ఫీలింగ్ ఉంది అన్న ఆయన నా కులం సింగిల్స్ కులం, సింగిల్స్‌గా ఉన్న అందరూ నా బ్రదర్సే. జై సింగిల్, సింగిల్స్ రాక్స్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు శ్రీకాంత్ వ్యాఖ్యలపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: srikanth iyengar tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X