బాలయ్య సినిమాలో ఫ్యామిలీ హీరో కీ రోల్: స్పెషల్ డేన క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాంటి వాటిలో నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కాంబోలో 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలు రావడం.. ప్రేక్షకుల ఆదరణను అందుకుని అవి సూపర్ డూపర్ హిట్లుగా నిలవడమే దీనికి కారణం. ఇక, ఈ రెండు విజయవంతమైన సినిమాల తర్వాత బాలయ్య.. బోయపాటి కలిసి మరో ప్రాజెక్టును చేస్తున్న విషయం తెలిసిందే. BB3 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.

హిట్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ, దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 23న ఈ హీరో పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్ ఓ పోస్టు పెట్టింది. ఇందులో ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పడంతో పాటు BB3లో శ్రీకాంత్ భాగం అయినట్లు పోస్టర్‌ను కూడా వదిలింది. దీంతో బాలయ్య సినిమాలో ఆయన నటించేది కన్ఫార్మ్ అయింది. అయితే, ఏ పాత్ర అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

Srikanth Key Role in Boyapati - Balakrishna Movie

ఎన్నో అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌తో పాటు సామ్నా కాసీం హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X