మెగా ఫ్యాన్స్ కి షాకిచ్చిన యువ దర్శకుడు.. మీరు ఆ చిరంజీవిని చూడరంటూ
తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని టాప్ మోస్ట్ సీనియర్ హీరోస్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో మెగాస్టార్ చిరంజీవి అందుకోని హిట్స్ గాని లేదా ప్లాప్ లు గాని లేవు. అయితే ఇపుడు ఉన్న ట్రెండ్ లో చిరంజీవి లైనప్ పై మాత్రం చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అంటే తాను రీమేక్ సినిమాలు చేసి భారీ హిట్స్ కొట్టినప్పటికీ ఇపుడు ఉన్న ఓటిటి యుగంలో ఓ రీమేక్ చేస్తే తన సినిమాలను ఆడియెన్స్ రిజెక్ట్ చేసేస్తున్నారు.
అలా మెగాస్టార్ నుంచి కేవలం ఫ్రెష్ కథలు మాత్రమే ఆశిస్తున్నారు ప్రేక్షకులు. తమిళ సీనియర్ హీరోలు కమల్ హాసన్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ లు ఇపుడు తమ ఏజ్ కి తగ్గ సినిమాలు చేస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇంకా హీరోయిన్స్ తోనే సినిమాలు చేసున్నారు అంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ ఆయనపై వస్తున్నాయి.

దీనిని గమనించిన చిరంజీవి కొంచెం రూటు మార్చి పలు స్ట్రైట్ సినిమాలు మాత్రమే ఓకే చేయడం స్టార్ట్ చేశారు. అలాగే తన ఏజ్ కి తగ్గ హీరోయిన్స్ ని ఎంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే మెగాస్టార్ నుంచి వింటేజ్ ట్రీట్ ని మెగా అభిమానులు ఆశిస్తుండగా మధ్యలో దర్శకుడు కొల్లి బాబీ కొంచెం ట్రై చేసి వాల్తేరు వీరయ్యతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు వశిష్ఠతో "విశ్వంభర" అనే స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. ఇక ఇది కాకుండా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. ఆ చిత్రమే యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో అనౌన్స్ చేసిన వైలెన్స్ సినిమా. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని స్వయంగా నిర్మిస్తున్నాడు.

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో అభిమానులు ఎంతో ఎగ్జైట్ అవుతుండగా ఇపుడు అదే ఫ్యాన్స్ కి ఒక దర్శకుడుగా చిరంజీవి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఓ ఊహించని షాక్ ఇచ్చాడు. తన సినిమాలో వింటేజ్ మెగాస్టార్ ని చూపించేది లేదు అని ముందే చెప్పేస్తున్నాడు. అదేంటి మళ్ళీ పాత చిరంజీవిని చూద్దామని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం కదా అంటే..
అందుకు భిన్నంగానే తన అభిమాన హీరోని పూర్తిగా కొత్తగా చూపించి కొత్త ట్రీట్ ని ఇవ్వాలని తాను డిసైడ్ అయ్యాడట. సో.. దీనితో మెగా ఫ్యాన్స్ కి వింటేజ్ ట్రీట్ లేకపోయినా మెగాస్టార్ నుంచి ఒక పూర్తి కొత్త వెర్షన్ రావచ్చని చెప్పాలి. ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో హీరోయిన్ గాని పాటలు లాంటివి కూడా ఉండవు అంటూ పలు రూమర్స్ చిత్ర పరిశ్రమలో హల్ చల్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











