శ్రీకాంత్ విడుదల చేసిన ‘దేవరకొండలో విజయ్ ప్రేమకథ’ పోస్టర్

శివత్రి ఫిలిమ్స్ పతాకంపై విజయ్ శంకర్, మౌర్యాని జంటగా రూపొందిన కొత్త సినిమా 'దేవరకొండలో విజయ్ ప్రేమకథ'. ఈ చిత్ర పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమాకు అపజయం ఉండదు. ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ శంకర్ ఉన్నాడని, నూటికినూరు శాతం ఈ సినిమా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. కేవలం యంగ్ స్టర్స్‌తో ఈ సినిమా రూపొందించడం విశేషం అని శ్రీకాంత్ అన్నారు.

Srikanth released Devarakondalo Vijay Premakatha poster

నిర్మాత పడ్డాన మన్మథరావు మాట్లాడుతూ.. సినిమా తాము అనుకున్నదానికన్నా బాగా వచ్చిందని చెప్పారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించామన్నారు. హీరో శ్రీకాంత్ గారు మంచి మనసుతో తమను ఆశీర్వదించారని, ఆయన పేరులోనే సక్సెస్ ఉందని, ఆయన చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించడం తమ విజయానికి మొదటిమెట్టుగా భావిస్తున్నానని అన్నారు.

దర్శకుడు వెంకటరమణ ఎస్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని చెప్పారు. కథను నమ్ముకునే తాము ఈ ప్రాజెక్టును చేపట్టామని, విజయం తమ సొంతమవుతుందని నమ్ముతున్నామని అన్నారు.

హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. తనకు ఇది మొదటి సినిమా అని చెప్పారు. హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరగడం తన అదృష్టమన్నారు. తన కెరీర్‌లో ఇదే నిజమైన దీపావళి అన్నారు.

సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. మంచి కథాంశం ఉంటే విజయం వెన్నంటే ఉంటుందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జి. అమర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ ఎస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగినీడు, వెంకట గోవిందరావు, శివన్నారాయణ, కోటేశ్వరరావు, రచ్చరవి, సునీత, శిరిరాజ్, చలపతిరావు, సాయిమణి, సుభాష్ రెడ్డి నల్లమిల్లి నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X