‘సలార్’ స్పెషల్ సాంగ్‌‌లో ఆ భారీ మూవీ హీరోయిన్: షురూ అయ్యేది అప్పటి నుంచే

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - కన్నడ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న చిత్రం 'సలార్'. పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం సింగరేణి బొగ్గు గనుల్లో ప్రారంభం అయింది. అక్కడ హీరో ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్‌ను తెరకెక్కించారు. పాన్ ఇండియా రేంజ్‌లో వస్తున్న ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ కరోనా ప్రభావం కారణంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన మిగిలిన పనులను చేస్తున్నాడు దర్శకుడు. ఇందులో భాగంగానే మరో భామను ఇందులోకి దింపుతున్నాడట.

ప్రభాస్ నటిస్తోన్న 'సలార్'లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ కోసం కన్నడ భామ 'కేజీఎఫ్' హీరోయిన్ శ్రీనిధి శెట్టిని తీసుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికే ఆమె దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె రాకతో ఈ యాక్షన్ సినిమాకు అదనపు గ్లామర్ వచ్చి చేరినట్లైంది.

Srinidhi Shetty Special Song in Prabhas Salaar

ఇక, 'సలార్'లోని ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ వచ్చే నెల ఆరంభంలో జరుగుతుందట. దీనికి ప్రముఖ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్లు తెలిసింది. అందుకు తగ్గట్లుగానే ఇందులో స్టెప్పులు కూడా అదుర్స్ అనిపించేలా డిజైన్ చేయబోతున్నారట. ఇదిలా ఉండగా.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్‌లతో కనిపిస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2022 ఏప్రిల్ 14న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X