శ్రీనివాస్ అవసరాల 'ఎన్నారై' ఫస్ట్ లుక్ రిలీజ్.. కీలక పాత్రలో మంచు లక్ష్మి!
దర్శకుడు, నటుడు అయిన శ్రీనివాస్ అవసరాల కొత్త చిత్రం ప్రారంభం అవుతోంది. బాలా రాజశేఖరుని దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర, టైటిల్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. ఎన్నారై అనేది ఈచిత్ర టైటిల్. ఎన్నారై అంటే నాయన రారా ఇంటికి అని అర్థం. ఫస్ట్ లుక్ ని చాలా ఫన్నీగా డిజైన్ చేశారు. అమెరికన్ ఫ్లాగ్ ఉండే టీ షర్ట్, చేతిలో టిష్యు పేపర్, పక్కనే వివిధ రకాల వస్తువులతో అవసరాల శ్రీనివాస్ గెటప్ ఆసక్తికరంగా ఉంది.
అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా మంచు లక్ష్మి కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. నాగబాబు కూడా ఈ చిత్రంలో ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. కేఆర్ ప్రదీప్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యోగేశ్వర శర్మ సంగీతం అందిస్తున్నాడు. బాబు బాగా బిజీ చిత్రం తర్వాత శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలోనటిస్తున్న చిత్రం ఇదే.

ఫిబ్రవరి 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్నారై చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 11: 30 గంటలకు ఈ చిత్రాన్ని పూజ కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. కంప్లీట్ ఫన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తూన్నారు.


Click it and Unblock the Notifications











