‘సీటీమార్’ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్: అతడి దెబ్బకు పొట్ట చెక్కలవుతుందట

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు టాలెంటెడ్ స్టార్ హీరో గోపీచంద్. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే సినిమా చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలన్న లక్ష్యంతో దీన్ని ఓటీటీలోకి తీసుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్‌ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సీటీమార్'లో హీరో గోపీచంద్.. హీరోయిన్ తమన్నా భాటియా ఇద్దరూ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరు కోచ్‌ల పక్కన అసిస్టెంట్లుగా ప్రముఖ కమెడియన్లు నటిస్తున్నారట. మరీ ముఖ్యంగా మిల్కీ బ్యూటీ పక్కనే ఉండే పాత్రలో శ్రీనివాస రెడ్డి నటిస్తున్నాడట. సినిమా మొత్తం ట్రావెల్ అయ్యే ఈ రోల్ ఎంతో హైలైట్‌గా ఉంటుందట. అంతేకాదు, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా ఈ రోల్‌ను డిజైన్ చేశాడట దర్శకుడు. అందుకు అనుగుణంగానే ఈ సీన్స్ అన్నీ అదిరిపోయేలా వచ్చాయని టాక్.

Srinivasa Reddy Role Highlight in Gopichands Seetimaarr​ Movie

గోపీచంద్ కెరీర్‌లోనే హిట్ అవసరం అయిన పరిస్థితుల్లో వస్తున్న 'సీటీమార్' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక, దీన్ని మూవీని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. భూమిక చావ్లా కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, ఇందులో అప్సరా రాణి ఓ స్పెషల్ సాంగ్‌ను చేసింది. వీళ్లతో పాటు రావు రమేష్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యమైన రోల్స్‌లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X