అల్లు ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అతని కెరీర్ క్లోజ్.. కోపం లేదు కానీ అంటూ!

టాలీవుడ్ ను, టాలీవుడ్ లో ప్రముఖులను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు శ్రీరెడ్డి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేసే ఈ భామ తాజాగా మెగా హీరోలలో భాగమైన అల్లు హీరోలను టార్గెట్ చేసింది. శ్రీ రెడ్డి భవిష్య వాణి అనే పేరుతో ఆమె ఈ పోస్ట్ చేసింది.. అల్లు గాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది, నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడూ తప్పు అవ్వలే సుమీ.. నాకేం కోపం లేదురా వాడు అంటే, కానీ ఎందుకో ఇలా అనిపిస్తుంది రా మరి.. తప్పుగా అనుకోకండి జాగ్రత్త అని చెబుతూ శ్రీరెడ్డి భవిష్యవాణి అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది.

అయితే శ్రీరెడ్డి మాట్లాడేది అల్లు అర్జున్ గురించా ? లేక అల్లు శిరీష్ గురించా ? అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ లో పవన్ కళ్యాణ్ అంటే ఇంతెత్తున లేచి శ్రీరెడ్డి ఎప్పుడు అవకాశం దొరికినా ఆయనను విమర్శిస్తూ ఉంటుంది. అవకాశం దొరక్క పోయినా వీలు చూసుకుని మరీ పవన్ కళ్యాణ్ ని విమర్శించే ఈ భామ అనూహ్యంగా ట్రాక్ మార్చి అల్లు హీరోస్ మీద పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ తో పోలిస్తే అల్లు శిరీష్ ఇప్పుడు సినిమాలు ఏమీ చేయడం లేదు.

Srireddy targets allu family

దీంతో ఆమె కామెంట్ చేసింది అల్లు అర్జున్ మీదనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశం మీద శ్రీరెడ్డి క్లారిటీ ఇస్తే తప్ప ఆమె ఎవరిని టార్గెట్ చేసింది అనే అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశాలు లేవు. నిజానికి గతంలో కూడా శ్రీరెడ్డి అల్లు అర్జున్ మీద కామెంట్ చేసింది. ఎప్పుడు ఒరిజినల్ హెయిర్ కనిపిస్తావు ? ఎప్పుడూ ఎక్స్టెన్షన్ కనిపిస్తూ ఉంటావని ఆమె అప్పట్లో సెటైర్ వేసింది. గతంలో ఆమె కామెంట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగానే ఆమెను కామెంట్స్ తో ఎటాక్ చేశారు. మళ్లీ ఇప్పుడు అల్లు హీరోలను ఎందుకు టార్గెట్ చేసిందో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X