For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరాటే కళ్యాణి, చిరంజీవిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. పావలా శ్యామల సాయంపై దారుణంగా కామెంట్

    |

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వేధింపుల వ్యవహారంతో నటి శ్రీరెడ్డి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరినీ వదలకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు దాదాపు అందరినీ టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ చెన్నైకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి, కరాటే కళ్యాణిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    Sri Reddy makes fun of pawan kalyan fans | Venky Kudumula | Filmibeat Telugu
    చెన్నైలో సెటిలయినా వదలట్లేదు

    చెన్నైలో సెటిలయినా వదలట్లేదు

    టాలీవుడ్ ని వదిలేసి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టింది శ్రీరెడ్డి. పలు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ చెన్నైలో నివాసం ఉంటోంది. అయినా సరే అప్పుడప్పుడు కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద పోస్టులు పెడుతూనే ఉంటుంది.

     పావలా శ్యామల సాయం

    పావలా శ్యామల సాయం

    తాజాగా వెలుగులోకి వచ్చిన పావలా శ్యామల సాయం విషయం వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి పావలా శ్యామల దిక్కుతోచని స్థితిలో ఉందనే విషయం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ క్రమంలో చాలామంది తమకు తోచిన సాయం చేశారు. ఇక చిరంజీవి సైతం ఆమెకు మా మెంబర్ షిప్ లేదని తెలిసి లక్ష రూపాయలు అందించారు. కరాటే కళ్యాణి సైతం తన సర్కిల్ లో విరాళాలు సేకరించి పావలా శ్యామలకు అందించారు.

    అమ్మో అరాచకం

    అమ్మో అరాచకం

    అయితే పావలా శ్యామల వేరే వాళ్ళ వద్ద చేస్తున్న కొన్ని కామెంట్స్ ఇప్పుడు రచ్చ రేపాయి. ఈ విషయం మీద కరాటే కళ్యాణి కూడా కౌంటర్స్ ఇస్తున్నారు. ఇలా యూట్యూబ్, ఫేస్ బుక్ వేదికగా ఈ రచ్చ జరుగుతుంటే ఏమీ సంబంధం లేని శ్రీ రెడ్డి చిరంజీవి, కరాటే కళ్యాణి గురించి మాట్లాడుతూ దారుణంగా కామెంట్స్ చేసింది. పత్రికా బాషలో వాడలేని విధంగా శ్రీరెడ్డి కామెంట్ చేసింది.

    సోనూను తొక్కేస్తాడేమో

    సోనూను తొక్కేస్తాడేమో

    ఇక ఆ తరువాత మళ్ళీ చిరంజీవిని ఉద్దేశించి మరో పోస్ట్ పెట్టింది. స్టార్ హీరోలు, వాళ్ళ తిండి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారని ఆమె కామెంట్ చేసింది. కానీ డార్లింగ్ విలన్ సోనూ మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జనానికి సేవ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. కుళ్ళు చిరంజీవి మా సోనూ కెరీర్ ని తొక్కుతాడని భయం నాకు అంటూ కామెంట్ చేసింది.

    English summary
    Controversial actress Sri Reddy make some sensational comments on chiranjeevi, and karate kalyani. recently karate kalyani took pavala shyamala bad situation into public notice. in this issue srireddy made some sensational comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X