చిరంజీవి కులం అది కాదు.. అసలు కులం ఇదీ, కనకపు సింహాసనం మీద శునకం మర్చిపోయారా అంటూ శ్రీ రెడ్డి సంచలనం!

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వేధింపుల వ్యవహారంతో నటి శ్రీరెడ్డి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరినీ వదలకుండా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు దాదాపు అందరినీ టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేసింది. తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ చెన్నైకు మకాం మార్చేసిన ఈ బ్యూటీ వీలు చిక్కినప్పుడల్లా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేసి సంచలన వ్యాఖలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

చెన్నైలో సెటిలయినా వదలట్లేదు

చెన్నైలో సెటిలయినా వదలట్లేదు

టాలీవుడ్ ని వదిలేసి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టిన శ్రీరెడ్డి పలు యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తూ చెన్నైలోనే నివాసం ఉంటోంది. అయినా సరే అప్పుడప్పుడు కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పవన్ గురించి ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద పోస్టులు పెడుతూనే ఉంటుంది..

వైసీపీలోకి చిరంజీవి

వైసీపీలోకి చిరంజీవి

కొద్ది రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల విషయంలో మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలో చేరతారని ఆయన కీలక పదవులు కట్టబెట్టి అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పేరుతో పార్టీని నడుపుతూ కీలకంగా వ్యవహరిస్తున్నా సరే ఈ పుకార్లకు మాత్రం అంతులేకుండా పోతోంది.

ఆ కులమే కాదు

ఆ కులమే కాదు

తాజాగా అలాంటి పుకార్లను బేస్ చేసుకుని నటి శ్రీరెడ్డి వరుస వీడియోలు పోస్ట్ చేసింది. చిరంజీవి కులాన్ని కూడా ప్రస్తావిస్తూ చిరంజీవి కాపు కులానికి చెందిన వ్యక్తి కాదని వాళ్లది కళావంతులు అనే ఒక కులం అని చెప్పుకొచ్చింది. అసలు కాపులే కాదని ఫేక్ కాపులు అని ఆమె పేర్కొంది.. అంతేకాక ఆయనకు ఇవ్వాలనుకున్న సీటు నికార్సయిన అసలుసిసలు వైసీపీని నమ్ముకున్న కాపు వ్యక్తికి ఇవ్వాలని శ్రీరెడ్డి సూచించింది..

ఆ అవమానం మరిచిపోయాడా

ఆ అవమానం మరిచిపోయాడా

అంతేకాక వైసిపి అనేది ఒక బ్రాండ్ అని మనకి ధనం ఉన్న వ్యక్తులు ఎందుకు ? అలాగే సెలబ్రిటీలు ఎందుకు ? అని ఆమె ప్రశ్నించారు. మనం సాధారణ వైసీపీ కాపు కార్యకర్తలు, కాపు లీడర్లు ఎంపీ సీటు తీసుకోవడానికి తగిన వారు కాదా అని ఆమె ప్రశ్నించింది. అంతేకాక పల్లకి మోసే వారి కష్టాన్ని వదిలేసి దారిని పోయే అనామకుడిని శిఖరం మీద కూర్చోబెట్టడం అంటే కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినట్లు అనే జోక్ జగన్ మీద నాగబాబు వేయించినప్పుటి అవమానం మరిచిపోయి జగనన్న ఆ తప్పు చేస్తున్నాడా అని ఆమె ప్రశ్నించారు.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
అసాధ్యం

అసాధ్యం

అంతేకాక వైసిపి పల్లకి మోసిన సీనియర్ కాపు వ్యక్తికి ఎంపీ సీటు ఇవ్వాల్సిందిగా నా విజ్ఞప్తి అని ఆమె తన ఫేస్బుక్ వేదికగా కామెంట్లు చేసింది.. అయితే ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారు అయినాసరే చిరంజీవి వైసీపీలో చేరటం అనేది అసాధ్యం అని చెబుతారు.. మరి శ్రీ రెడ్డి ఏ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్స్ చేసిందో ఆమెకే తెలియాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X