నవ్వులు పూయిస్తున్న శ్రీవిష్ణు 'సామజవరగమన' ట్రైలర్.. రేపే ప్రిమియర్స్
చిన్న చిన్న పాత్రలు వేస్తూ హీరో స్థాయికి ఎదిగి కథలనే ఆధారంగా చేసుకుని.. సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఫలితం ఎలా ఉన్నా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉండే శ్రీవిష్ణు.. ఈసారి సామజవరగమన అంటూ రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటుండగా.. మరోవైపు ప్రీమియర్స్ షో వివరాలు తెలిపారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే...
నిఖిల్ తో శ్రీవిష్ణు పోటీ..:టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... బిగిల్ ఫేం తమిళ నటి రెబా జాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్ 29వ తేదీన రీలిజ్ కు సిద్ధం అయింది. అయితే అదే రోజున నిఖిల్ పాన్ ఇండియా మూవీ స్పై కూడా రీలిజ్ అవుతుండటంతో.. నిఖిల్ తో పోటీకి దిగాడు శ్రీవిష్ణు.

చిరంజీవి చేతుల మీదుగా..:ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. గోపీ సుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఫ్యామిలీ ఆడియోన్స్ ను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సామజవరగమన థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయింది.

కామెడీ డ్రామాగా సామజవరగమన..:సామజవరగమన ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా మొత్తం కామెడీ డ్రామాగా తెరకెక్కిందని తెలుస్తోంది. శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ పవర్ ఏంటో మరోసారి చూపించాడు ఈ సినిమాలో. దానితో పాటు.. కొన్ని యాక్షన్ సీన్లు ఉండగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అమ్మాయిలకు దూరంగా ఉండే పాత్రను శ్రీ విష్ణు పోషించాడు. అమ్మాయిలతో అతడు రాఖీ కట్టించుకుంటుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తో లవ్ పడుతాడు. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంది.

ఆకట్టుకుంటున్న డైలాగ్స్: శ్రీ విష్ణు.. థియేటర్లో టికెట్లు ఇచ్చే ఉద్యోగిగా కనిపిస్తే.. మధ్యతరగతి తండ్రిగా నరేశ్ కనిపించాడు. మరోవైపు ఈ ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే కేజీఎఫ్‍లో బానిసలంటూ హీరోయిన్ తో నరేశ్ డైలాగ్ చెబుతాడు. ఇక ఈ సినిమాలో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల, దేవీ ప్రసాద్, ప్రియ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.
సామజవరగమన ప్రీమియర్స్..:
మరోవైపు ఈ సినిమాపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. విడుదల తేదీకి ముందే హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రత్యేక ప్రీమియర్‌లను ప్లాన్ చేసారని తెలుస్తోంది. రేపు విజయవాడ, వైజాగ్, నెల్లూరు, గుంటూరు, కడప, కాకినాడ, ఏలూరులో ప్రీమియర్లను ప్లాన్ చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ లో ప్రీమియర్ ను ఏర్పాటు చేశారు. సినిమా కంటెంట్ మీద నమ్మకంతోనే ప్రీమియర్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











