OG: పవన్ మూవీలో పవర్‌ఫుల్ లేడీ.. మరోసారి అలాంటి పాత్రలోనే!

గతంలో సినిమాలకు ఇచ్చిన గ్యాప్‌ను భర్తీ చేసేలా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు టాలీవుడ్ బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీ ఇచ్చిన రాకెట్ వేగంతో దూసుకుపోతోన్న అతడు.. ఇప్పుడు వరుసగా 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'BRO' సినిమాను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సాహో'తో సెన్సేషన్ అయిన యంగ్ డైరెక్టర్ సుజిత్‌తో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే సినిమాను కూడా చేస్తున్నాడు. యాక్షన్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది.

సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీనే 'OG'. ఈ సినిమా ముంబై నేపథ్యంతో సాగే ఓ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ స్టోరీతో తెరకెక్కబోతుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. అంతేకాదు, వరుసగా అప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది. ఇక, ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోన్న చిత్ర యూనిట్.. ఇప్పటికే వరుసగా కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా చిత్రీకరణను శరవేగంగా జరుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది.

Sriya Reddy Onboard for Pawan Kalyan and Sujeeth OG Movie

హై ఓల్టేజ్ యాక్షన్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'OG' మూవీలో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు నటిస్తున్నారు. ఇలా ఇప్పటికే కొందరి పేర్లను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక, ఇప్పుడు ఇందులో ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం కోలీవుడ్‌కు చెందిన శ్రీయా రెడ్డిని తీసుకున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు 'ఓజీ చిత్రంలోకి మీకు స్వాగతం. ఈ చిత్రంలో మీరు అందరినీ షాక్‌కు గురి చేస్తారని ఆశిస్తున్నాము' అంటూ ట్వీట్ చేశారు. ఇందులో శ్రీయా ఓ పవర్‌ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నట్లు కూడా న్యూస్ లీకైంది.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ రూపొందించే 'OG' చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్ సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X