విడిపోయిన అమ్మా నాన్నలను కలపడం తప్పని తెలుసుకున్నా: శృతి హాసన్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శృతి హాసన్. తనపై ఎన్ని రూమర్లు వచ్చినా ఏ మాత్రం లెక్క చేయని ఈ బ్యూటీ ఉన్న ఒక్క జీవితాన్ని ఇష్టం ఉన్నట్లుగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అనుభవించాలని చెబుతోంది. అయితే విడిపోయిన తన తలిదండ్రులను కలపాలని శృతి హాసన్ చాలా సార్లు ప్రయత్నం చేసిందట. ఇటీవల ఇంటర్వ్యూలో ఆ విషయాల గురించి ఆమె స్పందించారు.

తండ్రి సపోర్ట్ లేకుండానే..

తండ్రి సపోర్ట్ లేకుండానే..

కమల్ హసన్ నటనలో లోక నాయకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే కమల్ హసన్ తన కూతురిని కూడా అలానే నేర్చుకునేలా చేశారు. తండ్రి స్టార్ హీరో అయినప్పటికీ ఆయన సపోర్ట్ లేకుండానే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

 మల్టీ టాలెంటెడ్..

మల్టీ టాలెంటెడ్..

దాదాపు సౌత్ లో ఉన్న స్టార్ హీరోలందరితో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక అంతకంటే ముందే.. మ్యూజిక్ ద్వారా అమ్మడు తన టాలెంట్ ని బయటపెట్టింది. ఈనాడు సినిమా కోసం సొంతంగా ట్యూన్ చేసి రిలీజ్ చేసిన పాటకు మంచి గుర్తింపు దక్కింది. అప్పుడప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.

అమ్మనాన్నలు విడిపోవడం మంచిదే..

అమ్మనాన్నలు విడిపోవడం మంచిదే..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన అమ్మనన్నాల గోడవపై స్పందించింది. శృతి మాట్లాడుతూ.. వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చాలా సార్లు గోడవపడేవారు. ఎన్నో పనులు చేసుకొని ఇంటికి వస్తే కూడా వివాదాలు ఉంటే.. మనిషిగా మనం ప్రశాంతతను కోల్పోతాము. రోజు ఆ విధంగా ఇబ్బందులు పడుతూ ఉండడం కంటే విడిపోవడమే మంచిదని శృతి వివరణ ఇచ్చింది.

Recommended Video

Actress Sruthi Hariharan Announces Pregnancy On Instagram || Filmibeat Telugu
తప్పు చేశాను..

తప్పు చేశాను..

అమ్మ నాన్నల విషయంలో చాలా సార్లు కొన్ని తప్పులు చేశానని చెబుతూ.. వారి మధ్య గొడవలు ఎక్కువైనా సందర్భాల్లో వారిని కలపడానికి ప్రయత్నం చేశాను. నిజంగా అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అర్ధ అయ్యింది. ఒక మనిషితో కలవడం మరో వ్యక్తికి ఇష్టం లేనప్పుడు మనం ఒకటి చేయాలని అనుకోవడం మన స్వార్ధమే అవుతుంది. వారికి ఇష్టం ఉన్నట్లుగా జీవించడమే ఉత్తమం అంటూ శ్రుతి హాసన్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X