షాకింగ్: ఆకాశవాణి సినిమా నుంచి రాజమౌళి కుమారుడు అవుట్.. దర్శకుడు క్లారిటీ

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తీకేయ తాజాగా తాను నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఆకాశవాణి చిత్రం నుంచి తప్పుకొంటున్నారనే వార్త సినీ వర్గాల్లో కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నది. అయితే దర్శక, నిర్మాతల మధ్య విభేదాలే కారణమనే వాదన వినిపించింది. అయితే ఆ విషయంపై స్వయంగా దర్శకుడు, రచయిత అశ్విన్ గంగరాజు ఓ ప్రకటనలో వెల్లడించడం తాజాగా చర్చనీయాంశమైంది. ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఏం చెప్పారంటే..

ఆకాశవాణి నుంచి కార్తీకేయ అవుట్

ఆకాశవాణి నుంచి కార్తీకేయ అవుట్

ఆకాశవాణి మూవీ నిర్మాణం నాకు పెద్ద డ్రీమ్‌గా భావించి చేపట్టాను. నా మిత్రుడు కార్తికేయ నాకు జతకలవడంతో ప్రాజెక్ట్ విస్తృతి మరింత పెరిగింది. అయితే రాను రాను ఆయనతో పనిచేయడం చాలా కష్టంగా మారింది. కానీ దురదృష్టవశాత్తూ మాకు వేరే బాధ్యతలు ఉండటం, ఇతర క్రియేటివ్ పనుల కారణంగా మా మధ్య అవగాహన కుదర్లేదు. దాంతో మేము సహృద్బావంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నాం అని అశ్విన్ గంగరాజు తెలిపారు.

 నా ప్రాజెక్టులో భాగమైనందుకు థాంక్స్

నా ప్రాజెక్టులో భాగమైనందుకు థాంక్స్

నా ప్రాజెక్ట్, నా కలను అర్థం చేసుకొని నాకు సపోర్ట్‌గా నిలిచిన కార్తికేయకు థ్యాంక్స్. అలాగే ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టును భుజానికెత్తుకొన్న ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ పద్మనాభరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ఆయన నాతో జత కలవడంతో ఈ ప్రాజెక్ట్ భారీ మొత్తంలో మార్పులు చోటుచేసుకొన్నాయి. ఓ మంచి స్పిరిట్‌తో నేను, నా టీమ్ ముందుకెళ్తున్నాం అని అశ్విన్ గంగరాజు తన లేఖలో చెప్పారు.

మరింత క్వాలిటీతో

మరింత క్వాలిటీతో

అంతేకాకుండా ప్రేక్షకులకు నేను చెప్పాలనుకొన్న కథ, కథనాలపై మరింత నమ్మకం, విశ్వాసం పెరిగింది. ఈ అందమైన కథ కోసం ఆసక్తిగా, ఆతృతతో ఎదురుచూడటం మాలో మరింత ఉత్సాహాన్ని, ప్రేరణను పెంచింది. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే కొనసాగితే.. అవుట్ మరింత క్వాలిటీతో ఇస్తాం. త్వరలోనే ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అని అశోక్ గంగరాజు తెలిపారు.

కాస్త ఆలస్యమైనా.. మంచి అనుభూతితో

కాస్త ఆలస్యమైనా.. మంచి అనుభూతితో

ఆకాశవాణి సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఆ జాప్యం వల్ల మెరుగైన క్వాలిటీతో సినిమాను అందించి కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే మిమల్ని ఉత్తేజపరిచే విధంగా ఫస్ట్‌లుక్‌ను తీసుకొస్తాం. కథకుల కంటే కథనే గొప్పది. అదే మమల్ని నడిపిస్తున్నది దాని వెంటే మేము ఫాలో అవుతున్నాం అని అశ్విన్ గంగరాజు తన లేఖలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X