రాజమౌళి రగ్బీ.. కొడుకు కబడ్డీ!
రాజమౌళి తనయుడు కార్తికేయ క్రీడారంగంలో పెట్టుబడి పెడుతున్నాడు. తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 2 ఈనెల 14 నుంచి ప్రారంభం కాబోతోంది. కబడ్డీ లీగ్ లో నిర్మాత సాయి కొర్రపాటితో కలసి కార్తికేయ నల్గొండ జట్టుని దక్కించుకున్నారు. దీనికి సంబందించిన ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభించారు.
ప్రచారం కోసం విడుదల చేసిన సాంగ్ రాజమౌళి తెరకెక్కించిన సై చిత్రాన్ని గుర్తుకు చేసే విధంగా ఉంది. సై చిత్రం రగ్బీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అప్పట్లో యువతనుంచి మంచి ఆదరణ లభించింది.

నల్గొండ ఈగల్స్ జట్టు ప్రచారం కోసం కార్తికేయ సినిమాటిక్ గా ఆలోచిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు. ఇటీవలే కార్తికేయ నిశ్చితార్థం కూడా జరిగింది. మరి కబడ్డీ పోటీల్లో రాజమౌళి కుటుంబం ఎలా సందడి చేస్తుందో చూడాలి. మరో వైపు జక్కన్న ఆర్ఆర్ఆర్ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











