రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరు గొప్ప నటులు?: రాజమౌళి తెలివైన ఆన్సర్
దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ఇక నుంచి పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటాయని అర్ధమయ్యింది. బాహుబలితో అగ్ర దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్న జక్కన్న RRR సినిమాతో అంతకు మించి అనేలా వండర్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక RRR సినిమాలో రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరి హీరోలలో ఎవరు నటనతో సర్ ప్రైజ్ చేశారు అనే విషయంలో దర్శకుడు రాజమౌళి చాలా తెలివైన సమాధానం ఇచ్చారు.

టెలివిజన్ షోలలో..
ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. కేవలం న్యూస్ చానల్స్ కు మాత్రమే కాకుండా టెలివిజన్ షోలలో కూడా సందడి చేస్తూ జనాలకు సినిమా గురించి ప్రత్యేకంగా చేరువయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా కపిల్ శర్మ కామెడీ షోలో అలాగే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కూడా ప్రత్యేకంగా పాల్గొన్న విషయం తెలిసిందే.

ప్రమోషన్ విషయంలో..
దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రమోషన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అని స్పెషల్ గా చెప్పనవసరంలేదు. సినిమా జనాలకు చేరువయ్యేలా చేయడానికి ఆయన అనేక రకాల ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. ఇక RRR సినిమాకు సంబంధించి మంచి వాతావరణం క్రియేట్ అయ్యేలా కూడా మాట్లాడుతూ ఉంటారు.

చాలా తెలివిగా..
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి ఇద్దరు హీరోలతో సినిమాలు చేశారు కాబట్టి ఇందులో ఎవరు పర్ఫెక్ట్ నటులు ఎవరు మిమ్మల్ని ఎక్కువగా సర్ ప్రైజ్ చేశారు అనే ప్రశ్నకు దర్శకుడు చాలా తెలివిగా సమాధానమిచ్చాడు. వెండితెరపై ఇద్దరినీ సమానంగా చూపించిన రాజమౌళి భారీ వ్యక్తిగత నటనపై కూడా చాలా ఈక్వల్ గా ఆన్సర్ ఇవ్వడం విశేషం.

తారక్ గురించి తెలుసు..
మొదట జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తారక్ గురించి నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. అతనికి ఒక సీన్ గురించి చెబితే అప్పుడే దాన్ని ఊహించుకుంటాడు. కథ చెప్పడం దగ్గర నుంచే దాన్ని సగం తనలోతానే ఫీల్ అవుతూ సెట్ లోకి వచ్చేసరికి నిమిషాల్లోనే కావలసింది ఇచ్చేస్తాడు. ఇందులో మాత్రం నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ విషయంలో నేను పెద్దగా సర్ ప్రైజ్ అవ్వను.

రామ్ చరణ్ విషయానికి వస్తే
రామ్ చరణ్ విషయానికి వస్తే మాత్రం అతను అలా కాదు. చాలా డిఫరెంట్ నటుడు. మన దగ్గరికి వచ్చేటప్పుడు రామ్ చరణ్ చాలా క్లీన్ గా వస్తాడు. అంటే అతను ఒక వైట్ పేపర్ లాంటి యాక్టర్. దాన్ని మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఇవ్వడంలో రామ్ చరన్ ఎప్పుడూ ముందుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అతను డైరెక్టర్ హీరో అని చెప్పవచ్చు. మనకు కావాల్సింది పర్ఫెక్ట్ గా ఇవ్వగలరు అని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో నేను సర్ ప్రైజ్ అయ్యాను.. అని రాజమౌళి తెలియజేశాడు

సక్సెస్ కి చిరునామా..
ఒకరిని తగ్గించకుండా ఒకరిని పెంచకుండా దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అందుకే ఆయన సక్సెస్ కి చిరునామా అయ్యారు అంటూ.. ఇద్దరు హీరోలను ఒకే ఫ్రేమ్లో చూపించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు అని అది రాజమౌళి గారికే సాధ్యం అవుతుందని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా చూశాక ఇద్దరు బెరోల అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారని రాజమౌళి తెలియజేశారు.


Click it and Unblock the Notifications











