RRR విషయంలో రాజమౌళికి ఏపీ సీఎం ఇచ్చిన హామీ ఏమిటంటే?
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమావేశం గురించి దర్శకుడు రాజమౌళి వివరణ ఇచ్చారు. సమావేశంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ.. సీఎం గారు చాలా క్లియర్‌గా చెప్పారు. గతేడాది కరోనా, జీవోలు, సినిమా, అధికారుల మధ్య చర్చలు సరిగా జరగకపోవడం కొంత గందరగోళానికి దారి తీసింది. అయితే తక్కువ కాలంలోనే ఇరు వర్గాల మధ్య ఉన్న కన్‌ఫ్యూజన్ చర్చల ద్వారా తొలగిపోయింది. జీవో జారీ అనంతరం సీఎం కలిసిన తర్వాత మాకు సానుకూలమైన సంకేతాలు అందాయి. మా సినిమా విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తాయని అన్నారు. సీఎం మమ్మల్ని రిసీవ్ చేసుకొన్న తర్వాత మాకు కొంత కాన్ఫిడెన్స్ పెంచింది. RRR కోసం మార్చి 15న సీఎంను కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన విషయాలు మాకు మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది అని రాజమౌళి అన్నారు.
భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. మీరు నష్టపోవడం మా అభిమతం కాదు. అలాగే ప్రేక్షకుడి మీద కూడా భారం పడకూడదనే ప్రభుత్వం నిర్ణయం. మీకు నష్టం రాకుండా మేము చర్యలు తీసుకొంటాం. ప్రభుత్వం, సినిమా లాభపడేలా నిర్ణయం తీసుకొంటామనే హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాల్సిందే.

అయితే బెనిఫిట్ షోల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీ ప్రభుత్వం ఐదు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాన్ని బట్టి మాకు ప్రతీ రోజు బెన్‌ఫిట్ షో వేసుకొన్నట్టు దాని సమాధానం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇప్పుడు దాని మీద నేను ఏదో మాట అంటే.. మీరు మరో మాట రాయడం, అది మరో వివాదానికి దారి తీయడం జరుగుతుంది. కాసేపు ఆగితే అన్ని విషయాలు తెలుస్తాయి అని రాజమౌళి అన్నారు.
ఇదిలా ఉండగా, RRR సినిమా కోసం టికెట్ రేట్ పెంచుకొనే వెసులు బాటను ఏపీ ప్రభుత్వం కలిగించింది. ఏపీలో ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారని రాజమౌళి మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో దానికి ఇప్పటికే పర్మిషన్ ఇచ్చారన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 5 షోలు రన్ కానున్నాయి. ఈ క్రమంలో కలెక్షన్లు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఏపీలో టికెట్ రేట్లను అదనంగా రూ.100 పెంచుకునేందుకు సర్కారు అనుమతి ఇచ్చింది.


Click it and Unblock the Notifications











