RRR2 త్వరలో ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్.. హింట్ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, కార్తీకేయ
ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొన్న తర్వాత RRR టీమ్ మెంబర్స్ అమెరికాలో సంబురాల్లో మునిగిపోయారు. విదేశీ మీడియాకు తన ఆనందాన్ని, తమ అనుభవాలను, అనుభూతులను పంచుకొంటూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. RRR టీమ్‌లో ముఖ్యంగా రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ అనేక విషయాలు వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి విదేశీ మీడియాతో మాట్లాడుతూ RRR సీక్వెల్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి జక్కన్న చెప్పిన విషయం ఏమిటంటే?
ఆస్కార్ అవార్డును అందుకొన్న RRR టీమ్ లాస్ ఎంజెలెస్‌లోని రాజమౌళి నివాసంలో పార్టీని నిర్వహించారు. యూనిట్ సభ్యులందరూ ఉత్సాహంతో పార్టీలో పాల్గొన్నారు. అలాగే పార్టీలతోపాటు కూడా మీడియా సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. RRR సీక్వెల్‌కు స్క్రిప్టు వర్క్ జరుగుతున్నది. ఆస్కార్ గెలిచిన తర్వాత స్క్రిప్టు వర్క్ మరింత స్పీడ్ పెంచాం అని రాజమౌళి తెలిపారు.

RRR సీక్వెల్‌కు మా నాన్న విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు వర్క్ జరుగుతున్నది. ఆయన సీరియస్‌గా RRR2 స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారు. RRR సినిమా చేస్తున్నప్పుడు సీక్వెల్ ఐడియా లేదు. కానీ ఈ సినిమా విజయం సాధించిన తర్వాత సీక్వెల్ ఆలోచన వచ్చింది. కొన్ని పాయింట్లపై చర్చ జరిపాం. కానీ ఆ పాయింట్లు ఉత్తేజాన్ని కలిగించలేదు. అందుకే ఇంకా స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నాం. విజయేంద్రప్రసాద్ స్క్రిప్టు పూర్తి చేసిన తర్వాత సీక్వెల్ పనులు మొదలవతాయి. RRR2 సినిమా గురించి త్వరలోనే ప్రకటన చేస్తాం అని రాజమౌళి చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆస్కార్ అవార్డు గెలిచిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ విదేశీ మీడియాతో మాట్లాడుతూ.. RRR సీక్వెల్ ఉంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను చెప్పడం సరికాదు. త్వరలోనే అధికారికంగా RRR2 గురించి ప్రకటన వెలువడుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











