SS Rajamouli జపాన్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. 83 ఏళ్ల వృద్దురాలి ప్రేమకు జక్కన్న ఎమోషనల్!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి జపాన్‌లో అరుదైన గౌరవం దక్కింది. ఆయన డైరెక్షన్‌లో రూపొందిన RRR మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్వయంగా రాజమౌళి హాజరయ్యారు. భారీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందలాది మంది అభిమానులు రాజమౌళిపై ప్రశంసలు గుప్పించారు. జపాన్‌లో రాజమౌళికి దక్కిన గౌరవం విషయానికి వస్తే..
RRR సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో చిత్ర యూనిట్‌తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకొన్నారు. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆ కార్యక్రమం రద్దు జరిగింది. అయితే ఆ వేడుకను మార్చి 18వ తేదీన జపాన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తన అభిమానులతో రాజమౌళి ముచ్చటించారు.

జపాన్ పర్యటనలో రాజమౌళికి ఘన స్వాగతం లభించింది. ఆయన రాక నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయనపై అభిమానాన్ని మీమ్స్ రూపంలో గుమ్మరించారు. ట్విట్టర్‌లో రాజమౌళి ట్రెండింగ్‌గా నిలిచారు. రకరకాల మీమ్స్‌తో ట్వీట్ చేస్తూ జపాన్ ప్రేక్షకులు తమ అభిమానాన్ని చాటుకోవడం చర్చనీయాంశమైంది.

జపాన్‌లోని ఓ ఆడిటోరియంలో రాజమౌళి జై హో అంటూ అభిమానులు నినాదాలు మిన్నంటాయి. RRR సినిమా ప్రదర్శన తర్వాత అభిమానులు తన ప్రేమను చాటుకొన్నారు. కిక్కిరిసిన థియేటర్‌లో గట్టిగా అరుస్తూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జపాన్‌లో అభిమానుల ప్రశంసల్లో ముద్దైన ఆయన ట్వీట్ చేశారు. ఓ వృద్దురాలు తనపై ప్రేమను కురిపిస్తూ అందించిన బహుమతిని ట్వీట్ చేసి తన భావాలను పంచుకొన్నారు. ఓరిగామి క్రేన్స్‌తో రూపొందించిన ఓ బహుమతిని అందించారు. తాము ప్రేమించే వారికి ఆరోగ్యం, అదృష్టం లభించాలని ఇలాంటి బహుమతులను అందిస్తారు. RRR సినిమా తనకు గొప్ప అనుభూతిని ఇచ్చినందుకు 83 సంవత్సరాల ముసలావిడ నాకు బహుమతి అందించింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా తనకు గిఫ్ట్‌ను ఇచ్చేందుకు బయటవేచి ఉండటం నన్ను కదిలించింది అని రాజమౌళి తన ట్వీట్‌లో తెలిపారు.


Click it and Unblock the Notifications











