రాజమౌళి శిష్యుడు దర్శకత్వంలో కథ మొదలైంది.. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌తో

దేశం గర్వించదగిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ కేవీ దర్శకత్వంలో 'కథ మొదలైంది' పేరుతో సినిమా మొదలైంది. ఇందులో సంజయ్ వర్మ, లహరి, సంజనా చౌదరి, దర్శిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డ్రీమ్జ్ యానిమేషన్స్ (ప్రై) లిమిటెడ్ బ్యానర్‌పై తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టీ రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్‌కు చిత్ర నిర్మాతల్లో ఒకరైన తమటం కుమార్‌రెడ్డి క్లాప్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ.. ''చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నాను. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హీరో సంజయ్‌కి కెరీర్ ఆరంభంలోనే ఇంత మంచి కథ లభించడం చాలా అదృష్టంగా చెప్పుకోవాలి. నిర్మాతకు బాగా డబ్బులు, దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకొంటున్నాను'' అని అన్నారు.

SS Rajamouli assistant Sai Krishna KV turns director for Katha Modalayindi

నిర్మాతల్లో ఒకరైన తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ..'' రాజమౌళి శిష్యుడైన సాయికృష్ణ చెప్పిన కథ వినగానే వెంటనే ఓకే చెప్పాను. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుంది. 'ఒక చిన్న విరామం', 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ' చిత్రా్లో హీరోగా నటించిన సంజయ్ వర్మ ఇందులో హీరోగా నటిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌లోనే చిత్రకరణ పూర్తి చేస్తాం'' అని అని తెలిపారు.

దర్శకుడు సాయికృష్ణ కేవీ మాట్లాడుతూ... ''కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిది. సమాజంలో మన చుట్టూ జరిగే సంఘటనల నుంచి స్పూర్తి పొంది చేస్తున్న సినిమా ఇది'' అని చెప్పారు.

SS Rajamouli assistant Sai Krishna KV turns director for Katha Modalayindi

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, వసుధ, సిమ్రాన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు, భూషణ్, బాబీ, దొరబాబు, హర్ష తదితరులు
కథ: జయకుమార్
మాటలు: విజయ్ నాగభైరు
కెమెరా: ఎస్ఆర్ శేఖర్
సంగీతం: సన్నీ మాణిక్
ఆర్ట్ : ఇమ్రాన్
పాటలు: రామాంజనేయులు
కో-డైరెక్టర్: శ్రీరామ సూర్య
నిర్మాతలు: తమటం కుమార్ రెడ్డి, సన్నిధి ప్రసాద్, టీ రమేష్
రచన, దర్శకత్వం: సాయికృష్ణ కేవీ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X