For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో అవతారమెత్తిన రాజమౌళి.. కొడుకులు చేసింది కట్ చేస్తాడట.!

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. అందుకే ఈయన వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా రాజమౌళి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

  అన్నీ సూపర్ హిట్లే

  అన్నీ సూపర్ హిట్లే

  రాజమౌళి ఇప్పటి వరకు 11 సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అన్ని సినిమాలూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో మూడేసి సినిమాలు, రామ్ చరణ్, రవితేజ, సునీల్, నితిన్‌, నానిలతో ఒక్కో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గానే పేరు తెచ్చుకున్న రాజమౌళి.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

  అన్న కొడుకుల తొలి ప్రయత్నం

  అన్న కొడుకుల తొలి ప్రయత్నం

  రాజమౌళి సోదరుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుమారులిద్దరూ టాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థలు కలిసి చేస్తున్న ‘మత్తు వదలరా' అనే సినిమా ద్వారా ఆయన చిన్న కుమారుడు సింహా కోడూరి హీరోగా పరిచయం అవుతుండగా, సింగర్ కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్‌గా తొలి ప్రయత్నం చేయబోతున్నాడు.

  జూనియర్ సహాయంతో మొదలు

  జూనియర్ సహాయంతో మొదలు

  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. అంతేకాదు, తన సోదరులిద్దరూ సక్సెస్ అవ్వాలని ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఇంట్రస్టింగ్‌గా డిజైన్‌ చేశారు. న్యూసెన్స్‌ పేరుతో ఉన్న వార్త పత్రికలో శ్రీ సింహను హీరోగా పరిచయం చేస్తున్నట్టుగా వార్తతో పాటు ఆశ్యర్యం వక్తం చేస్తున్న ఎన్టీఆర్‌ స్టిల్‌, బ్లడ్‌ షేడ్స్‌తో పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది.

  మరో అవతారంలో రాజమౌళి

  మరో అవతారంలో రాజమౌళి

  ఈ సినిమా కోసం రాజమౌళి ఎడిటర్‌గా మారారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. తన సోదరుల కుమారులు చేస్తున్న సినిమా కావడంతో జక్కన్న దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారట. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ గ్యాప్‌లో ‘మత్తు వదలరా'కు కత్తిరింపులు జరపబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

  #CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
  భారీ చిత్రంతో జక్కన్న

  భారీ చిత్రంతో జక్కన్న

  ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి ‘RRR' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

  English summary
  The title reveal of a film by debutants titled ‘Mathu Vadalara’ took place today evening. Directed by Ritesh Rana, the film sees music by Kaala Bhairava, cinematography by Suresh Sarangam and editing by Karthika Srinivas. During the title reveal, the production house wrote on their social media, promising more details soon
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X