పుష్ప 1 సక్సెస్ వెనకాల రాజమౌళి స్ట్రాటజీ.. జక్కన ఏం చేశాడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రాలతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ఫ 1, పుష్ప 2 చిత్రాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అప్పటికే అల్లు అర్జున్ కు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉండటం, పుష్ప మ్యానరిజంతో ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అయితే 'పుష్ప : ది రైజ్' చిత్రం భారీ సక్సెస్ కావడానికి మార్కెట్ విషయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హస్తం కూడా ఉందని తాజాగా అల్లు అర్జున్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించిన గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఇంతకీ రాజమౌళి ఏమని సలహానిచ్చారంటే..
ట్రెండ్ సెట్ చేసిన పుష్ప రాజ్..
అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప : ది రైజ్ చిత్రం 2023 డిసెంబర్ 17న విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూ.250 కోట్లతో గ్రాండ్ గా నిర్మించారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, సునీల్, జగదీశ్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్పెషల్ డ్యాన్స్ తో దుమ్మురేపింది. ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా పుష్ప రాజ్ మేనరిజం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తగ్గేదేలే డైలాగ్ తో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ సెట్ చేసింది. ఇండియన్ క్రికెటర్స్ కూడా పుష్పరాజ్ మేనరిజాన్ని ఫాలో అవడంతో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కింది.

రాజమౌళి సూచనలతో మరోమలుపు..
ఈ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర, దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, ముఖ్యంగా సమంత ఆడిన ఊ అంటావా మావా సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా పాటలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే బాక్సాఫీస్ వద్ద రూ.360 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతే కాదు ఈ చిత్రంలోని పుష్ప రాజ్ పాత్రకు గానూ ఏకంగా బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరో అల్లు అర్జునే కావడం విశేషం. అయితే ఈ చిత్రం ఇన్ని రకాలుగా సక్సెస్ కావడానికి ఎస్ఎస్ రాజమౌళి సలహాలు, సూచనలు కూడా ఉన్నాయని అల్లు అర్జున్ తాజాగా వెల్లడించారు.
రాజమౌళికి అల్లు అర్జున్ మరోసారి థ్యాంక్స్..
గద్దర్ అవార్డ్స్ 2025 ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ పుష్ప : ది రైజ్ చిత్రం గురించి మాట్లాడారు. ఆ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి బలమైన కారణాల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరని అల్లు అర్జున్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పుష్ప 1 రిలీజ్ కు ముందు టీమ్ రాజమౌళిని స్పందించగా.. అవుట్ పుట్ బాగుందని, తెలుగు స్టేట్స్ లోనే కాకుండా హిందీ మార్కెట్ లోనూ విడుదల చేయాలని సూచనలు ఇచ్చారంట. అందుకు తగిన స్ట్రాటజీని కూడా చెప్పారంట. రాజమౌళి మాటలతో హిందీతోపాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంతోనే ఇంత పేరు వచ్చిందని అల్లు అర్జున్ చెప్పారు. ఇక పుష్ప2 కు గానూ మొట్టమొదటిగా గద్దర్ అవార్డ్ ను అందుకోవడం కూడా సంతోషంగా ఉందని చెప్పారు.
మొదటి నుంచి రాజమౌళి స్ట్రాటజీ ఇదే..
ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలను ఎలాంటి స్ట్రాటజీలతో ప్రమోట్ చేస్తారో తెలిసిందే. ముఖ్యంగా జక్కన్న కథను నమ్మితే మాత్రం దానికోసం ఎంత దూరమైన వెళ్తారు. ఎప్పుడూ సినిమా ఒకే ప్రాంత పరిధిలో కాకుండా సబ్జెక్ట్ బాగుంటే ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ గా మార్కెట్ చేసుకోవాలని మొదటి నుంచి తాపత్రాయ పడుతుంటారు. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. మగధీరనే పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని భావించారు. కానీ బాహుబలితో ఆ స్ట్రాటజీ కుదిరింది. ఇప్పుడు SSMB 29తో ఏకంగా పాన్ వరల్డ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ లో AA22xA6 రూపుదిద్దుకుంటోంది. జూన్ 10నే ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











