రామోజీ పార్ధీవదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భోరున విలపిస్తూ శ్రద్దాంజలి!
ఈనాడు మీడియా అధినేత, ప్రముఖ సినీ నిర్మాత రామోజీరావు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన లేని లోటును తలచుకొంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామోజీని చివరి చూపు చూసుకోవడానికి రామోజీ ఫిలింసిటీ బాటపట్టారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ చివరిచూపుకోసం ఆయన పార్థీవ దేహాన్ని సందర్శిస్తున్నారు. సినీ దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజమౌళి కంటతడి పెట్టుకోవడం తీవ్రంగా కలిచివేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కుటుంబానికి రామోజీ రావుకు అవినాభావ సంబంధం ఉంది. బాహుబలి సినిమాలో ఆయన కూడా నిర్మాతగా భాగమయ్యారు. అయితే ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లే ముందు.. రాజమౌళి, కీరవాణికి రామోజీ ఫోన్ చేసి.. RRR మూవీకి తప్పకుండా ఆస్కార్ తీసుకు రావాలని ఆకాక్షించారట. అదే విషయాన్ని కీరవాణి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

అలాంటి అనుబంధం, బంధం ఉన్న రాజమౌళి కుటుంబం.. రామోజీ మరణ వార్తతో కలతకు గురయ్యారు. గుండెలో బాధను అదిమి పట్టుకొని రామోజీ పార్థీవదేహం వరకు వెళ్లారు. నిస్తేజంగా శాశ్వత నిద్రలో ఉన్న ఆయనను చూడగానే రాజమౌళి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. కట్టలు తెంచుకొన్న దు:ఖం బయటకు వచ్చింది. దాంతో భోరుమని విలపించారు.
రామోజీ పార్తీవదేహం పక్కనే ఉన్న శైలజ, కిరణ్‌ను పరామర్శించారు. వారికి గుండెంత ధైర్యాన్ని అందించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని పంచే ప్రయత్నం చేశారు. కీరవాణి, రమా రాజమౌళి, రాజమౌళి, ఇతర కుటుంబ సభ్యులు రామోజీకి శ్రద్దాంజలి ఘటించారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు గత కొద్దికాలంగా గుండె, ఇతర వృద్దాప్య వ్యాధులతో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బెడ్‌కే పరిమితమయ్యారు. ఆయన చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో శనివారం ఉదయం 3.45 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. దాంతో మీడియా లోకం శోక సంద్రంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











