SSMB 29: మహేష్ బాబు సినిమాలో ఇంటర్నేషనల్ హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా?
RRR సినిమాతో తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి.. మరో అద్భుతమైన సినిమాతో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో కాంబోలో ఓ సినిమా వస్తుండగా.. దీనిపై పెద్ద ఎత్తునే బజ్ క్రియేట్ అయింది. నటీనటులను కూడా ఫిక్స్ చేయకముందే.. ఇంత క్రేజ్ సంపాధించుకుంటున్న ఈ సినిమాలో ఇంటర్నేషనల్ హాట్ బ్యూటీని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జక్కన్న తర్వాతి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో అని తెలిసినప్పటి నుంచి.. ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు అటు రాజమౌళి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్లు బయటకు వస్తాయా అని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమా సక్సెస్ తర్వాత ఓ వారం రోజుల పాటు ఆయన విదేశాలకు కూడా వెళ్లారు.

అయితే విదేశాలకు వెళ్లడానికి కారణం కూడా SSMB29 సినిమా వర్క్ షాప్ కోసమే అని డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాంద్ వెల్లడించారు. మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబుకు ఇది 29వ సినిమా కాబట్టి దీనికి ఎస్ఎస్ఎంబీ29 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇదంతా ఇలా ఉండగా.. ఓ ఇంటర్నేషనల్ బ్యూటీని రాజమౌళి.. మహేష్ బాబు సినిమా కోసం రంగంలోకి దించారట.
ఇండోనేషియాలో పుట్టి.. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నా చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే హాట్ బ్యూటీని SSMB 29సినిమాలో ఓ కీలక పాత్రలో చూడొచ్చు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఈమె మాత్రం సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే డైరెక్టర్ రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాల గురించి చెబుతారని సమాచారం. చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ను కన్ఫార్మ్ చేసినట్లుగా చెప్పడమే కాకుండా... సినిమా గురించి మరిన్ని అదిరిపోయే అప్ డేట్లు ఇస్తారని అంతా అనుకుంటున్నారు.

మరోవైపు ఈ సినిమాను భారీ బజ్డెట్ తో తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ గా రాబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతికి నిపుణులను కూడా భాగస్వామం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా 1000 కోట్ల బడ్జెట్ తో అత్యద్భుతుంగా.. భారీ హంగులతో ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











