Salaar ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి.. ఏ థియేటర్‌లో, ఎప్పుడు చూడబోతున్నాడంటే!
పేరుకు తెలుగు హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అందుకే వరుసగా భారీ చిత్రాలనే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో 'సలార్' అనే ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమే 'సలార్'. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట డిసెంబర్ 22వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి.

'సలార్: సీజ్‌ఫైర్' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత మరో ట్రైలర్‌ను, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసుకున్నారు. కానీ, అనివార్య కారణాలతో వాటిని రద్దు చేసుకున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది.
పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూను నిర్వహించింది. ఇందులో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు.

దర్శకధీరుడు రాజమౌళి చేసిన 'సలార్' ఇంటర్వ్యూకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇక, తాజాగా ఈ సినిమా మొదటి టికెట్‌ను కూడా ఈ స్టార్ డైరెక్టర్ కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఫొటోను కూడా విడుదల చేసింది. ఇందులో డిసెంబర్ 22వ తేదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో ఉదయం 7 గంటల షోకు రాజమౌళి చూస్తారని వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











