SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ బుక్ రైట్స్.. ఆ పాపులర్ రైటర్ పుస్తకాలు రాజమౌళి ఎందుకు కొన్నారో తెలుసా?
సూపర్ స్టార్ మహేష్ బాబు దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే పాన్ ఇండియా మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళి ఈ ప్రాజెక్టు కోసం ఆఫ్రికన్ బుక్ రైట్స్ కొనుగోలు చేశారనే వార్త వైరల్ అవుతుంది. మరి ఆ బుక్స్ ఏంటి ? ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది అని ఇప్పటికే చిత్ర బృందం అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాజమౌళి ఈ బుక్స్ రైట్స్ ఎందుకు తీసుకున్నట్టు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.
మహేష్ బాబు రాజమౌళి యాక్షన్ అడ్వెంచరస్ మూవీకి తాత్కాలికంగా SSMB 29 అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ గతంలో రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించి ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రం జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.

కాగా ఈ మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం రాజమౌళి ప్రత్యేకంగా ఆఫ్రికన్ బుక్స్ ను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆఫ్రికన్ బ్రిటిష్ నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన బెస్ట్ సెల్లింగ్ అడ్వెంచర్ నవలలు ట్రయంఫ్ ఆఫ్ ది సన్, కింగ్స్ ఆఫ్ కింగ్స్ అనే బుక్స్ రైట్స్ ను రాజమౌళి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. చిత్ర నిర్మాతలు ఈ విషయం గురించి ఇంకా అధికారికంగా స్పందించలేదు.
అయితే ఆఫ్రికాలోని సుడాన్ నేపథ్యంలో ఉండే ఈ బుక్స్ రాజమౌళి విజన్ కు మరింత క్రియేటివిటీని అందిస్తాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ రెండు నవలలోని కథలు ఆఫ్రికన్ ప్రాంతంలో సాహసోపరితమైన ప్రయాణాల గురించి ఉంటాయి. అయితే నిజానికి చాలా కాలం క్రితమే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని రాజమౌళి తండ్రి, ఈ ప్రాజెక్టు స్క్రీన్ రైటర్ విజయేంద్రప్రసాద్ స్వయంగా వెల్లడించారు.

ఈ చిత్రం ఇండియానా జోన్స్ స్టైల్ లో అడ్వెంచర్ గా ఉంటుందని ఆయన ఎప్పుడో చెప్పారు. అలాంటిది రాజమౌళి ఇప్పుడు ఎందుకు ఈ బుక్స్ రైట్స్ కొన్నట్టు అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. దానికి సమాధానం ఏమిటంటే రాజమౌళి అందరూ అనుకున్నట్టుగా స్టోరీ లైన్ ఇన్స్పిరేషన్ కోసం కాకుండా విజువల్ రిఫరెన్స్ కోసం ఈ నవలల రైట్స్ ను కొన్నట్టుగా తెలుస్తోంది.
జక్కన్న ప్లాన్ చూస్తుంటే కచ్చితంగా ఈ మూవీ పాన్ వరల్డ్ మూవీ అవుతుందని అనిపిస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిందని అంటున్నారు. ఈ పవర్ ఫుల్ పాత్రకు తెరపై ప్రాణం పోసేందుకు మహేష్ బాబు కఠోరమైన శారీరక శిక్షణ తీసుకుంటున్నాడు. మరి SSMB 29 ప్రాజెక్ట్ ను జక్కన్న ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











