రాజమౌళితో మెగాస్టార్ మూవీ.. ఆ ఒక్క రీజన్ తో క్యాన్సిల్.. లేదంటేనా
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉంటూ ఓవైపు సినిమా ఇండస్ట్రీ బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఆరు పదుల వయస్సు దాటినా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తూ రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగానే అప్ కమింగ్ ఫిల్మ్స్ కూడా రూపుదిద్దుకుంటున్నాయి.
అయితే, మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరీయర్ లో ఇప్పటికే 155కి పైగా సినిమాలు చేశారు. ప్రస్తుతం మరో మూడు చిత్రాలు లైనప్ లో ఉండటం విశేషం. అయితే చిరంజీవి ఇప్పటికీ టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. 90లలోని ఉత్తమ దర్శకులు రాఘవేంద్ర, దాసరి నారాయణ వంటి వారితో కలిసి పనిచేశారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎస్ఎస్ రాజమౌళి ఏలుతున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవితో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి విష్ ఉండటం సహజమే. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్లతోనూ కలిసి పనిచేయాలని ఎంతటి స్టార్ హీరోలకైనా ఉంటుంది.

ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి - మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళితో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయకపోవడానికి ప్రధానమైన కారణం తెలిసిందే. రీసెంట్ ఇంటర్వ్యూలో చిరంజీవి మెగాస్టార్ తో కలిసి సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని వివరించారు. 'రాజమౌళితో సినిమా చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. నన్ను నేషన్ వైడ్ గా ఎస్టాబ్లిస్ చేసుకోవాలని లేదు. అందుకే నేను రాజమౌళితో కలిసి సినిమా చేయనని చెప్పాను.
అంతేకాదు రాజమౌళి ప్రతి సినిమాకు 4 నుంచి 5 సంవత్సరాల సమయం తీసుకుంటున్నారని అన్నారు. ఇక చిరు ఒకేసారి పార్లల్ గా నాలుగు సినిమాల్లో నటించే కెపాసిటీ ఉండటంతో అంత సమయం వృథా చేయలేం. నాలుగేళ్ల పాటు సమయం డెడికేట్ చేసినా ఆచరణీయంగా ఉండదేమోనని అనుకుంటున్నాను.. అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక జక్కన్న తన సినిమాలకు ఎక్కువ సమయాన్ని తీసుకోవడం పాటు పెర్ఫెక్ట్ గా ఉండేలా చూస్తూ ఉంటారు. బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు ఏకంగా ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రానికి మూడేళ్ల సమయం తీసుకున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత కూడా తన తదుపరి సినిమా SSMB29 ప్రారంభించడానికి కూడా 5 ఏళ్ల సమయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్నారు. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో కలిసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక 2027లో మార్చిలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి 'విశ్వంభర' చిత్రంతో త్వరలో అలరించబోతున్నారు. రేపు ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











