అప్పుడు సినిమా చేయమంటే చేయలే.. ఇప్పుడు సల్మాన్ కోసం వెంపర్లాడుతున్న జక్కన్న.. ఏమంటాడో?

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న తన ప్రతిష్టాత్మక మూవీ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ బాహుబలి దర్శకుడు దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేయాల్సి ఉండగా అది కుదరలేదు. అలాంటిది ఇప్పుడు తన కుమారుడు కార్తికేయతో కలిసి సల్మాన్ ను కలిసేందుకు ముంబై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

సరైన వ్యక్తి రాజమౌళి

సరైన వ్యక్తి రాజమౌళి

ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, సల్మాన్ - కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన బజరంగీ భాయిజాన్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించాలని కోరుకున్నారు. విజయేంద్ర ఈ చిత్రానికి కథను రాసి ముందు తన కొడుకుకె చెప్పారట. ఆ కధకు దర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తి రాజమౌళి అని అనుకున్నారు.

బజరంగీ భాయిజాన్‌కి

బజరంగీ భాయిజాన్‌కి

కానీ అప్పటికి బాహుబలి బిజీలో ఉన్న రాజమౌళి ఆ సల్మాన్ ఖాన్ సినిమా ఆఫర్ ను తిరస్కరించాడు. ఆ సమయంలో ఆయన కొన్ని ముఖ్యమైన యుద్ధ సన్నివేశాలకు దర్శకత్వం వహిస్తున్నాడు మరియు తన పనిపై పూర్తిగా దృష్టి పెట్టారు. అందుకే రాజమౌళి కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో బజరంగీ భాయిజాన్ ఆఫర్‌ని తిరస్కరించాడు. విజయేంద్ర తన కుమారుడికి కథ చెప్పడానికి సరైన సమయాన్ని ఎంచుకోలేదని, కథనానికి తగిన సమయాన్ని ఎంచుకుని ఉంటే, బహుశా రాజమౌళి బజరంగీ భాయిజాన్‌కి దర్శకత్వం వహించడానికి ఓకే చెప్పేవాడని కూడా చెప్పాడు.

 కబీర్ ఖాన్

కబీర్ ఖాన్

ఆ తరువాత టీమ్ లోకి డైరెక్టర్ గా కబీర్ ఖాన్ వచ్చి చేరాడు. ఆ పైన సినిమా ఎంత పెద్ద హాట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా విడుదల తరువాత బాక్సాఫీస్ రిజల్ట్ చూసి చాలా నెలలు బాధపడ్డాడట జక్కన్న. సల్మాన్ తో సూపర్ డూపర్ ఆఫర్ మిస్ అయ్యానని ఆయన పశ్చాత్తాపం చెందాడట. కాకపోతే, రాజమౌళి 'బాహుబలి'తో అంతకంటే ఎక్కువ దుమారమే రేపాడనుకోండి అది వేరే విషయం.

కార్తికేయ తో కలిసి ముంబైలో

కార్తికేయ తో కలిసి ముంబైలో

అయితే అయితే ఇప్పుడు రాజమౌళి తన కుమారుడు కార్తికేయ తో కలిసి ముంబైలో కనిపించడం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తమ సినిమా రిలీజ్ విషయంలో ప్రమోషన్స్ చేయమని కోరేందుకు సల్మాన్ ఖాన్ వద్దకు వెళ్ళాడు అని ప్రచారం జరుగుతుండగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఏదీ లేదు.

Recommended Video

SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Filmibeat Telugu
సల్మాన్ అయితే బెటర్

సల్మాన్ అయితే బెటర్

నిజానికి ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తుండడంతో ముంబైలో కూడా భారీగా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే సల్మాన్ఖాన్ లాంటి పెద్ద హీరో తమ సినిమాకి అండగా నిలబడితే వేరే లెవల్ లో ఉంటుందని భావిస్తున్న జక్కన్న సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిలబడేలా చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్ నుంచి ఈ సినిమాలో అజయ్ దేవగన్ కూడా నటించారు. అలాగే హీరోయిన్ గా అలియా భట్ నటించింది. వీళ్ళందరికీ మంచి మార్కెట్ ఉన్నా సల్మాన్ అయితే బెటర్ అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X