SS Rajamouli: రాముడి కంటే రావణుడే ఇష్టం.. రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజాగా ఇండియన్ ఓటిటిలో వైరల్ గా వినిపిస్తున్న పేరు ఎస్ ఎస్ రాజమౌళి డాక్యుమెంటరీ కోసం అని చెప్పాలి. వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు రాజమౌళి పై ప్లాన్ చేసిన డాక్యుమెంటరీ వారు తీసుకురాగా దీని కోసమే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ డాక్యుమెంటరీలో చాలానే అంశాలు తాను పంచుకోగా తనపై ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, రానా లాంటి స్టార్స్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అయితే ఇందులో ఒక ఆసక్తికర అంశం కొంచెం కాంట్రవర్సియల్ గా మారేలా ఉందని చెప్పాలి. తాను ఓ సందర్భంలో మాట్లాడుతూ తానొక నాస్థికుడిని అని చెప్పాడు. కానీ తనకి రాముడి కంటే రావణుడు అంటేనే బాగా ఇష్టం అని తెలిపాడు. ఇది మాత్రం ఒకింత స్ట్రైకింగ్ పాయింట్ అనే చెప్పాలి. అయితే ఈ డాక్యుమెంటరీని సరిగ్గా చూసినట్టు ఐతే రాజమౌళి ఈ కామెంట్ ఎందుకు చేసారో అర్ధం అవుతుంది.

రాజమౌళి సినిమాలలో మొదటి సినిమా నుంచి చూసుకున్నా తన సినిమాల్లో విలన్స్ ని ఏ రేంజ్ లో తాను ప్రెజెంట్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా రాజమౌళి చూపించినట్టుగా తన విలన్ ని మరో దర్శకుడు ఇతర సినిమాల్లో అంత బలంగా చూపించలేరు. అదే జక్కన్న స్పెషాలిటీ.. తన సినిమాల్లో విలన్స్ ని అత్యంత శక్తివంతంగా చూపించడం అంటే ఎంతో ఇష్టం అని అందుకు తనకి రావణాసుడు అంటే ఇష్టం అని అలా వారిని నా సినిమాల్లో చూపించడానికి ఇష్టపడతాను అన్నట్టుగా తెలిపారు.
రావణాసురునిలో చాలా లేయర్స్ ఉంటాయి. మీరు బాహుబలిలో రానా పాత్ర చూసినా తాను తనకి రాజ్యం కావాలి అనుకుంటాడు అందులోనే ఎన్నో లేయర్స్ అంటే ఒకసారిగా మంచిగా ఉన్నట్టు నటిస్తాడు, ఒకసారి తనలోని విలనిజాన్ని చూపిస్తాడు ఇలా తనకి ఇష్టం అని జక్కన్న చెప్పాడు తప్ప రాముడు తక్కువ రావణుడు తక్కువ అని ఎక్కడా చెప్పలేదు.
సో ఇది అక్కడ అసలు సారాంశం. గతంలో రాజమౌళి తన సినిమాల్లో మన పురాణాలూ, వాటిలో కొన్ని పాత్రలు ఆధారంగానే తన సినిమాలు చేస్తానని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు, అంతే కాకుండా ఎన్నో సినిమాల్లో అమ్మవార్లు, దేవుళ్లపై కూడా పలు పవర్ఫుల్ సీన్స్ ని రాజమౌళి చేసాడు. సో ఇవి కూడా అందరూ గుర్తుంచుకోవాలి. కాగా ఇపుడు జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో గ్లోబల్ లెవెల్ సినిమా చేస్తుండగా ఇది మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కనుంది.
అలాగే ఈ సినిమా ఇండియా లోనే అత్యధిక బడ్జెట్ సినిమాగా నిర్మించబడనుంది. దీనితో రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాని ప్రెజెంట్ చేసే ఛాన్స్ లు ఉన్నాయి. అలాగే ఈ సినిమాతోనే రాజమౌళి మొట్ట మొదటిసారిగా హాలీవుడ్ స్టూడియోస్ తో కూడా పని చేయనున్నారని టాక్. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ ఏడాది చివరలో అలా మొదలు కానుందట. మేకర్స్ సుమారు 1000 కోట్ల బడ్జెట్ ని ఈ సినిమాకి పెడుతున్నారని భోగట్టా.


Click it and Unblock the Notifications











