twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఇంటి అద్దె కట్టలేని పరిస్థితులలో ధైర్యం ఇచ్చిన సిరివెన్నెల.. RRRలో ఆ షాట్ తీయకుండానే..

    |

    తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో సాహిత్య రచనల తో ఎంతగానో ప్రసిద్ధి చెందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం తనువు చాలించడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి చెందారు అనగానే చాలామంది అభిమానులు కంటతడి పెట్టుకున్నారు. ఇక సినీ ప్రముఖులు ఎమోషనల్ గా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి తో ప్రతి ఒక్కరు వారి అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. రాజమౌళి కూడా ఆయనతో ఉన్న సాన్నిహిత్యం గురించి ఒక ప్రత్యేకమైన నోట్ ను విడుదల చేశారు.

    బాహుబలి తరువాత కూడా

    బాహుబలి తరువాత కూడా

    దాదాపు రాజమౌళి ప్రతి సినిమాలో కూడా సిరివెన్నెల సీతారామశాస్త్రి తో ఒక ప్రత్యేకమైన పాటను రాయించుకోవడం. అలవాటుగా వస్తూ ఉన్నదే. అతి ముఖ్యమైన పాటలకు సిరివెన్నెల గారు అయితేనే అద్భుతంగా ఉంటుంది అని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకునే వారు. సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే రాజమౌళి సిరివెన్నెల గారిని ఒక గురువు గారి లాగా భావించేవారు. బాహుబలి సినిమా తీసిన తర్వాత కూడా ఆయన వద్ద అదే గురుభక్తితో ఉంటూ వస్తున్నారు. RRRలో దోస్తీ పాటను కూడా రాయించుకున్నారు.

    ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి..

    ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి..

    సిరివెన్నెల కన్నుమూయడంతో రాజమౌళి సోషల్ మీడియా ద్వారా ఆయనతో ఉన్న అనుబంధం గురించి వివరణ ఇచ్చారు. రాజమౌళి ఈ విధంగా పేర్కొన్నారు. '1996 లో మేము అర్ధాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు , పేరు మొత్తం పోయింది . వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి . అలాంటి పరిస్థితులలో నాకు ధైర్యాన్నిచ్చి , వెన్ను తట్టి ముందుకు నడిపించినవి' ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి , ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి ' అన్న సీతారామశాస్త్రి గారి పదాలు అంటూ రాజమౌళి తెలియజేశాడు.

    రాత్రి 10 గంటలకి..

    రాత్రి 10 గంటలకి..

    భయం వేసినప్పుడల్లా ఆ పాట గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. ఇక మద్రాసులో డిసెంబర్ 31 వ తారీకు రాత్రి 10 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాను' ఏం కావాలి నందీ' అని అడిగారు. ఒక కొత్త నోట్ బుక్ ను ఆయన చేతుల్లో పెట్టి మీ చేతులతో పాట రాసివ్వమని అడిగాను.. రాసి ఆయన సంతకం చేసి ఇచ్చారు. జనవరి 1న మా నాన్న గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. నాన్న గారి కళ్ళల్లో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను.. అని పేర్కొన్నారు.

    గది దద్దరిల్లేలా నవ్వుతూ..

    గది దద్దరిల్లేలా నవ్వుతూ..

    ఇక సింహాద్రిలో అమ్మయినా నాన్నయినా, లేకుంటే ఎవరైనా.. అనే పాటతో పాటు మర్యాద రామన్న లో..పరుగులు తియ్ అనే పాట ఆయనకి చాలా ఇష్టం. అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది అని తిట్టి, మళ్ళీ ఆయనే.. ఈ ఛాలెంజ్ నాకు చాలా నచ్చింది.. అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరువేసుకుంటూ.. అర్థాన్ని మళ్ళీ విపులీకరించి చెప్తూ.. ఆయన స్టైల్ లో గది దద్దరిల్లేలా నవ్వుతూ.. పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు..

    Recommended Video

    RRR Trailer : RRR Official Trailer Release Date Announced | Bheemla Nayak || Filmibeat Telugu
    RRR లో ఆ షాట్ కోసం..

    RRR లో ఆ షాట్ కోసం..


    ఇక RRR లో దోస్తీ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్ లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాము.. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. అలా జరిగి ఉంటే అదొక గొప్ప జ్ఞాపకంగా ఉండేది. నా జీవన గమనానికి దిశా నిర్ధేశం చేసిన సీతారామశాస్త్రి గారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూన్నాను... అని రాజమౌళి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పేర్కొన్నారు.

    English summary
    Ss Rajamouli emotional note on Sirivennela Sitaramasastri death
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X