రాజమౌళి.. నోటి దూల తగ్గించుకో.. నెటిజన్ల ఫైర్
SS Rajamouli: దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి.. తెలుగు సినిమా పరిమితులను దాటి, భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన అగ్ర దర్శకుల్లో ఒకరు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా కాన్సెప్ట్ కు బ్రాండ్ అంబాసిటర్ గా మారిపోయారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'వారణాసి' అనే భారీ బడ్జెట్ ప్రాజెక్టును పాన్ వర్డల్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శనివారం నాడు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను విడుదల చేసిన అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఐతే ఈవెంట్ లో వేద్దామనుకున్న వారణాసి గ్లింప్స్ ని రిలీజ్ చేయడం కాస్త టైం పట్టింది.ఈ సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు.. వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. గ్లింప్స్‌ను 100 అడుగుల భారీ స్క్రీన్‌లపై ప్రసారం చేయాలని ముందుగానే యోచించినా, డ్రోన్‌లు ప్రవేశించడం, పవర్ ఇష్యూల వల్ల టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో గ్లింప్స్ లేట్ అయ్యింది. ఈ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ.. "నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. మా నాన్నగారు వచ్చి హనుమంతుడు వెనకాల ఉంటాడు. వెన్ను దట్టి ముందుకు నడిపిస్తాడు అని చెప్పాడు. ఇలా అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. హనుమంతుడు మీ ఇంట్లో ఉంటే ఇలాంటి సమస్య రాకూడదు కదా" అని అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. "దేవుడిని నమ్మని వ్యక్తి రామాయణం, హనుమంతుడిపై సినిమా ఎందుకు తీస్తాడు?" "సాంకేతిక లోపానికి దేవుణ్ణి నిందించడం ఏంటి?" అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ అందుకుంటారు, చిన్న సమస్య వచ్చినా దేవుణ్ణి నిందిస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ "దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ నిందించడానికి మీకు హక్కు లేదు", "సినిమా సక్సెస్ అయితే క్రెడిట్ మీదే, సమస్య వస్తే దేవుడా?" అంటూ నెటిజన్లు మండిపడ్డారు. రామాయణం, హనుమంతుడి కథల ఆధారంగా సినిమా తీయాలనుకుంటున్న రాజమౌళి దేవుణ్ణి అవమానించడం ద్వంద్వ వైఖరే అని విమర్శలు గుప్పిస్తున్నారు.
మరికొందరూ. "అందరికీ చూపించాల్సిన ఈవెంట్‌ని జియో హాట్ స్టార్ రెవెన్యూ కోసం వాడారు. టెక్నికల్ ఇష్యూ వచ్చినా దేవుణ్ణి నిందించడం ఎందుకు సర్? దేవుణ్ణి నమ్మనప్పుడు దేవుడిపై కోపం చూపించడం ఎందుకు? ఒక్క టెక్నికల్ గ్లిచ్ కోసం హనుమంతుణ్ణి తప్పుబడటం సరికాదు. నోటి దూల తగ్గించుకో.. మీ సినిమా హైప్ తగ్గదు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు గ్లింప్స్ చివరకు విడుదల కావడంతో మహేష్ బాబు రుద్రుడి - రాముడి షేడ్స్‌లో కనిపించిన విజువల్స్ అభిమానుల్లో హైప్‌ను రెట్టింపు చేశాయి. మహేష్ త్రిశూలంతో, నందిపై కూర్చొని కనిపించిన చివరి షాట్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. ప్రియాంకా చోప్రా మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ 'కుంభ' పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. 2027 సమ్మర్ రిలీజ్ లక్ష్యంగా సినిమా నిర్మాణం కొనసాగుతోంది.
విజువల్‌గా అద్భుతంగా ఉన్నా, రాజమౌళి వ్యాఖ్యలు హనుమాన్ భక్తుల్లో తీవ్ర నిరసన రేకెత్తించాయి. ప్రస్తుతం రాజమౌళి కామెంట్స్ ఇటు ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై రాజమౌళి స్పందిస్తారా? అభిమానుల ఆగ్రహాన్ని ఎలా తగ్గిస్తారు? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











