దటీజ్ రాజమౌళి... GlobeTrotter కోసం
తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి... సినిమాయే కాదు, తను చేసే ప్రతి పనిలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. తను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకు ఎంతో శ్రమిస్తారు. సినిమాను కూడా రోజులకు తరబడి తీస్తూ పని రాక్షసుడిగా ముద్ర వేయించుకున్నారు. సినిమాను కూడా శిల్పం చెక్కినట్లుగా చెక్కుతూ... ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో చేత జక్కన్న అనిపించుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో జక్కన్న ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈవెంట్‌లకు రాజమౌళి జాగ్రత్తలు
సినిమాయే కాదు.. సినిమాకు ముందు నిర్వహించే ప్రతి ఈవెంట్‌కు కూడా సినిమాకు మాదిరిగానే కష్టపడతారు రాజమౌళి. గతంలో ఆర్ఆర్ఆర్ ఈవెంట్ తనకు కావాల్సిన విధంగా రాలేదని భావించిన ఆయన .. ముంబై నుంచి గుర్రాన్ని, బుల్లెట్‌ని హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో తెప్పించి ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మళ్లీ రిహార్సల్స్ చేయించినట్లు ఓ ఇంటర్వ్యూలో తారక్ స్వయంగా వెల్లడించారు. అంతటి పర్ఫెక్షనిస్ట్ కావడం వల్లే ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించిన ఈవెంట్ కోసం కూడా రాజమౌళి అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ ఎస్ఎస్ఎంబీ 29 సినిమాను నిర్మిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి తొలి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేలా పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు జక్కన్న. దాంతో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌పై ఆసక్తి
ఈ సినిమా టైటిల్, మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో అనౌన్స్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు. మహేశ్ లుక్ ఎలా ఉండబోతోంది? టైటిల్ ఏంటీ? అనే దానిపైనా సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్ ప్రసార హక్కులను జియో హాట్‌స్టార్‌కి విక్రయించి సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతున్న తరుణంలో గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ జరుగుతుందా? లేక వాయిదా పడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు రాజమౌళి.. గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ యథావిధిగా జరుగుతుందని కానీ కఠిన నిబంధనలు అమలు చేస్తామని, వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు.
రాజమౌళి స్పెషల్ క్లాస్
ఇదిలాఉండగా.. గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఎవరు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే స్టార్ యాంకర్ సుమ కనకాల, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆశీష్ చాంచలానీ వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి.. మరోసారి తాను ఎంత పర్ఫెక్షనిస్ట్ అనేది నిరూపించారు. సుమ కనకాల, ఆశీష్‌లతో ప్రత్యేకంగా మాట్లాడి.. కొన్ని సూచనలు చేశారు. ఏమేం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలో కూడా కొంత కంటెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రాజమౌళి ది గ్రేట్ అంటూ అభిమానులు కాంప్లిమెంట్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











