Prabhas కల్కిపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్.. ఆటాడుకున్న నిర్మాత, డైరెక్టర్

టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియని వారుండరని చెప్పడంలో సందేహం లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాలు గ్లోబల్ స్థాయిలో అంతలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో చెక్కిన RRR మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పింది. ఆస్కార్ సైతం అందుకున్న తెలుగు చిత్రాన్ని అందించిన రాజమౌలి ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898AD) సినిమాపై చేసిన కామంట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. దీంతో ఆయన్ను నిర్మాత, డైరెక్టర్ టీజ్ చేస్తూ ట్వీట్స్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అగ్ర తారాగణం:గ్లోబల్ స్టార్ ప్రభాస్, హిందీ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె మొదటి సారి హీరోహీరోయిన్లుగా జత కట్టిన సినిమా కల్కి 2898 ఏడీ. మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అతిపెద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రోడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అగ్ర తారగణం నటిస్తోందన్న విషయం తెలిసిందే. .

SS Rajamouli Interesting Comment On Prabhas Kalki 2898 AD

సూపర్బ్ రెస్పాన్స్:కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే దీపికా పదుకొణెతోపాటు బాలీవుడ్ గ్లామర్ బాంబ్ దిశా పటానీ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగా మెప్పించనున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. విష్ణువు చివరి అవతారమైన కల్కిగా ప్రభాస్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

నెగెటివిటీ అలా:అయితే మొన్నటి వరకు ప్రాజెక్ట్ కెగా పిలవబడిన ఈ సినిమాకు శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా టైటిల్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీ అనే టైటిల్ తోపాటు గ్లింప్స్ వీడియో సైతం విడుదల చేసి ఆశ్చర్యపరిచారు. కల్కి 2898 ఏడీ టైటిల్ గ్లింప్స్ కు బీభత్సమైన స్పందన వస్తోంది. ఇందులో ప్రజలను కాపాడే కల్కిగా ప్రభాస్ గెటప్ అదిరిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియోతో ప్రభాస్ ఫస్ట్ లుక్ పై ఏర్పడిన నెగెటివిటీ పటాపంచలు అయింది.

SS Rajamouli Interesting Comment On Prabhas Kalki 2898 AD

ఆ కాలం నాటి:ఇప్పటివరకు తెలుగులో ఫ్యూచర్ కు సంబంధించిన సినిమాలను పూర్తి స్థాయిలో చూపించలేదు. ఇలా తొలిసారిగా 2898 నాటి కాలం పరిస్థితులను ఊహాజనితంగా కల్కిలో చూపించనున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఈ గ్లింప్స్ పై తాజాగా దర్శకదిగ్గజం రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

SS Rajamouli Interesting Comment On Prabhas Kalki 2898 AD

ఎవరు అడుగుతున్నారో:"గ్రేట్ జాబ్ నాగి, వైజయంతీ మూవీస్. ఇలాంటి భవిష్యత్ సినిమాలను తీయడం పెద్ద టాస్క్. అయినా మీరు చేసి చూపించారు. డార్లింగ్ (ప్రభాస్) లుక్స్ అదిరిపోయింది. కానీ, ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. రిలీజ్ డేట్ ఎప్పుడు" అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ ట్వీటుపై దర్శక, నిర్మాతలు స్పందించారు. "చూడండి. రిలీజ్ డేట్ కోసం ఎవరు అడుగుతున్నారో" అని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సరదాగా కామెంట్ చేశారు. దాన్ని రీట్వీట్ చేస్తూ "హాహా.. బాగా చెప్పారు శోభుగారు" అని డైరెక్టర్ హరీష్ శంకర్ రాసుకొచ్చారు.

SS Rajamouli Interesting Comment On Prabhas Kalki 2898 AD

సందిగ్ధత:అయితే రాజమౌళి ఒక సినిమాను సంవత్సరాల తరబడి చెక్కుతూనే ఉంటారని తెలిసిన సంగతే. అలాంటి ఆయన కల్కి రిలీజ్ డేట్ గురించి ట్వీట్ చేయడంతో ప్రొడ్యూసర్, డైరెక్టర్ సరదాగా టీజ్ చేశారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతిలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ, ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ లో డేట్ వెల్లడించలేదు. దీంతో కల్కి 2898 ఏడీ విడుదలపై సందిగ్ధత నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X