Mahabharat: మహాభారతంపై రాజమౌళి బిగ్ లీక్.. ఆ హీరోకు రోల్ కన్ఫార్మ్ చేశారా?
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ టాప్ మోస్ట్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా అది గ్లోబల్ లెవెల్ సంచలనమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ క్రమంలో జక్కన్న చేస్తున్న అన్ని సినిమాలు ఒకెత్తు అయితే తనన కలల చిత్రం మహాభారతం ఒకెత్తు అని చెప్పవచ్చు. జక్కన్నకి మన పురాణాలు అంటే ఎంత మక్కువ అనేది ఎన్నోసార్లు తెలిపారు.
తన పాత సినిమాల నుంచే చూసుకున్నా కూడా మన పురాణాల ప్రేరణతో ఎన్నో సీక్వెన్స్ లు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకొని తాను సినిమాలు తెరకెక్కించారు. ఇలా అనేక అంశాల ప్రభావం తనపై ఉన్నపుడే అవుట్ పుట్ ఈ లెవెల్లో ఉంటే ఇక తనకి ప్రేరణ కలిగించిన పురాణాల మీదే తాను సినిమా చేస్తే ఇంకెలా ఉంటుంది? ఇలా తన మహాభారతం పట్ల మాత్రం ఎనలేని హైప్ ఇపుడు నెలకొంది.

కాగా జక్కన్న తన డ్రీం ప్రాజెక్ట్ ని సునాయాసంగా 10 భాగాలుగా తెరకెక్కిస్తానని తెలిపారు. తన సినిమాలో తెలుగులో ప్రముఖ బిగ్ స్టార్స్ అంతా ఉంటారని కూడా అందరికీ తెలిసిందే. మరి ఈ అందరి హీరోస్ లో మాత్రం తన మొదటి హీరో ఎవరో బిగ్ లీక్ చేయడం ఇపుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా టాలెంటెడ్ యువ హీరో నాచురల్ స్టార్ నానికి రాజమౌళి ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నాని పిలిచిన ప్రతీ సినిమాకి తాను గెస్ట్ గా వచ్చారు. అంతే కాకుండా నాని కోసం తన సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కూడా జక్కన్న నటించడం జరిగింది. మరి అలాంటి నాని తన మహాభారతంలో ఉన్నాడు అని బిగ్ థింగ్ ని రివీల్ చేయడం కేజ్రీగా మారింది. లేటెస్ట్ గా హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనకి సుమ వేసిన ప్రశ్నకి గాను ఖచ్చితంగా నాని మహాభారతంలో ఉంటాడు అని చేసిన కామెంట్స్ ఇపుడు సంచలనంగా మారాయి.దీనితో స్వయంగా రాజమౌళినే ఈ విషయాన్ని రివీల్ చేయడం అనేది ఇప్పుడు నుంచే మహాభారతంపై మంచి అంచనాలు పెంచేదిగా మారింది.
ఇక ప్రస్తుతానికి నాని పేరు ఖరారు అయ్యింది కానీ తాను ఎలాంటి పాత్రలో కనిపిస్తాడు అనేది కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా మారింది. మొన్నామధ్య కల్కి 2898 ఎడి లో కృష్ణుని పాత్రకి నాని బాగా సెట్ అయ్యేలా ఉన్నాడని కామెంట్స్ వినిపించాయి.
మరి జక్కన్న మనసులో అదే ఉందో లేక పాండవులలో నకుల, సహదేవుని లాంటి ఇతర కీలక పాత్ర సెట్ చేస్తారో అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం నాని నటించిన అవైటెడ్ వైలెంట్ చిత్రం దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన 'హిట్ 3' ఈ మే 1న గ్రాండ్ గా రిలీజ్ కి వచ్చేందుకు సిద్ధం అయ్యింది. అలాగే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ సినిమాలో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











