శేఖర్ కమ్ముల వాట్సప్ సీక్రెట్ రాజమౌళి లీక్.. నేను ఆ విలువలకు దూరం అంటూ జక్కన్న
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ..
కుబెరా సినిమా టైటిల్ ప్రకటించి అందులో నాగార్జున అక్కినేని నటిస్తున్నారనే వార్త నన్ను చాలా ఇంప్రెసి చేసింది. ఆ తర్వాత ఈ సినిమాలో ధనుష్ కూడా ఉన్నారని తెలిసినప్పుడు నా అంచనాలు పెరిగిపోయాయి. ఈ కాంబినేషన్ చూసి మైండ్ బ్లాంక్ అయింది. ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు నిజంగా అదిరిపోయింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ చూడాలా? అనే ఆసక్తిని పెంచింది అని రాజమౌళి చెప్పారు.

పూర్తిగా సంపన్న ప్రపంచంలో నాగార్జున.. అందుకు భిన్నంగా పేద వర్గంలో ధనుష్‌ను పెట్టి కథ రాయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. కథ ఏమాత్రం చెప్పకుండా ట్రాన్స్‌ను రిలీజ్ చేసిన విధానం బాగా ఆకట్టుకొన్నది. ఆ ఎలిమెంట్స్‌తోనే ఈ సినిమాలోని ఎమోషన్స్, ఇంటెన్సిటీని చూపించాడు అని శేఖర్ కమ్ములపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.
శేఖర్ కమ్ముల వాట్సప్ వాడరనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన చూడటానికి బయటకు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు. చాలా హంబుల్‌గా ఉంటారు. కానీ ఆయన చాలా స్టబ్బర్న్. తన నమ్మిన సిద్దాంతాలు, ప్రిన్సిపుల్‌కు కట్టుబడి ఉంటారు. ఏదైనా సమయంలో వాటిని ఉల్లంఘించాల్సి వచ్చినా.. ఎవరు ఎంత ఆశ చూపించినా? ఒక్క ఇంచు కూడా పక్కకు జరగడు. ఆ క్వాలిటీ చూసి నేను ఆయనను ఆరాధిస్తాను. ఆయన నమ్మిన సిద్దాంతాలను సినిమాలుగా తీస్తారు. నేను మాత్రం నమ్మిన సిద్దాంతాలకు దూరంగా సినిమాలు తీస్తాను అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
శేఖర్ కమ్ముల విలువలను పాటించడం చూసి నాకు గర్వంగా, రెస్పెక్ట్ పెరిగిపోయింది. నీవు అలానే నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి. శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ విషయాన్ని వింటే నమ్మ బుద్ది కావడం లేదు. ఇప్పటి వరకు నేనే సీనియర్ అనుకొన్నాను. కానీ నేను ఆయనకు జూనియర్‌ను. 25 సంవత్సరాలు అలానే ఉన్నాడు. ఇక ముందు కూడా అలా విలువలను పాటిస్తూ తాను నమ్మిన సిద్దాంతాల ప్రకారం సినిమాలు తీయాలని కోరుకొంటాను అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
ఇదిలా ఉండగా, కుబేరా సినిమా విషయానికి వస్తే.. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్, బిజినెస్ హై రేంజ్‌లో జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











