SSMB29: బ్లాస్ట్ చేసేందుకు సిద్దమైన రాజమౌళి... మహేష్ బాబుతో ఫస్ట్ లుక్ రిలీజ్.. విడుదల ఎప్పుడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ అంచనాలను కలుగజేస్తుందని మహేష్ బాబు రాజమౌళి కలయికలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుంచి వీరి కలయిక పై రకరకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇది వరకే మహేష్ బాబును చాలా సార్లు కలిసిన రాజమౌళి బయటకు ఒక్క ఫోటోను కూడా విడుదల చేయలేదు.

కానీ ఫైనల్ గా శుక్రవారం రోజు నిర్మాతతో రాజమౌళి మహేష్ బాబు కలిసి ఒక ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ గా మారింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు అనే వివరాల్లోకి వెళితే..

త్రివిక్రమ్ ప్రాజెక్ట్..

త్రివిక్రమ్ ప్రాజెక్ట్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక తదుపరి సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. గత నెలలో లాంచ్ అయిన సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ రెండో వారంలో స్టార్ట్ అవుతుందట. దాదాపు అన్ని రకాల ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.

RRR ఫినిష్ అవ్వడంతో..

RRR ఫినిష్ అవ్వడంతో..

ఇక రాజమౌళి అయితే RRR సినిమాను గత ఏడాది నుంచి విడుదల చేయాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. వీలైనంత త్వరగా మహేష్ తో కూడా కొత్త సినిమాను మొదలు పెట్టాలి అని ఎన్నో ప్రణాళికలు రచించారు. కానీ కరోనా కారణంగా ఆయనకు చాలా బ్రేకులు పడ్డాయి. ఇక ఫైనల్ గా మార్చి 25 వ తేదీన RRR సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. RRR అన్ని రకాల పనులు పూర్తి కావడంతో మహేష్ బాబుతో చేయబోయే ప్రాజెక్ట్ పై రాజమౌళి ఫోకస్ పెట్టాడు.

పాన్ వరల్డ్ రేంజ్ లో..

పాన్ వరల్డ్ రేంజ్ లో..

మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత కె.ఎల్ నారాయణ పాన్ ఇండియా వరల్డ్ రేంజ్ లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాడు. ఈ సినిమా అభిమానుల అంచనాలకు మించి ఉంటుంది అని చెప్పవచ్చు. సినిమా అయితే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని గతంలోనే రచయిత కె.విజయేంద్రప్రసాద్ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

ఫొటో వైరల్

ఫొటో వైరల్

ఇక మహేష్ బాబు రాజమౌళి చాలా సార్లు కలుసుకున్నప్పటికి బయట జనాలకు మాత్రం ఆ విషయం పెద్దగా తెలియలేదు. కానీ ఫైనల్ గా ఇటీవల క లుసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మహేష్ బాబు రాజమౌళి అలాగే నిర్మాత ముగ్గురు కూడా నవ్వుతూ ఫోటోకు స్టిల్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ తో బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
రిలీజ్ ఎప్పుడంటే?

రిలీజ్ ఎప్పుడంటే?

SSMB 29 ఎప్పుడు విడుదలదలవుతుంది అనే విషయంలో కూడా దర్శకుడు రాజమౌళి ఒక క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. వీలైనంతవరకూ రెగ్యులర్ షూటింగ్ ను ఇదే ఏడాది చివర్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. కుదిరితే మహేష్ ఒక వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మరొకవైపు రాజమౌళి సినిమాను షూటింగ్ లో పాల్గొనాలి ఆలోచిస్తున్నాడు.

కానీ రాజమౌళి మాత్రం అలా చేయడని ఒక టాక్ వినిపిస్తోంది. తన హీరోలు వీలైనంత వరకు తన సినిమాతోనే బిజీగా ఉండాలని అప్పుడే తనకు కూడా ఫ్రీడమ్ ఉంటుందనే తరహాలో రాజమౌళి ఆలోచిస్తున్నాడట. ఇక సినిమాను 2024 దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు తేవాలి అని ఆలోచిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X