SSMB29: రాజమౌళి ఫ్యామిలీలో విషాదం.. మహేష్ బాబు మూవీకి బ్రేక్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చివరిగా 'ఆర్ఆర్ఆర్'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా 'బాహుబలి' తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటారు. అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా సినీ నటులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా తెలుగు గడ్డపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 'నాటు నాటు' పాటకు తెలుగు చిత్ర పరిశ్రమకు, ఇండియాలోనే మొదటిసారిగా ఆస్కార్ వరించింది.

ఇక నెక్ట్స్ జక్కన్న చేస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 'ఎస్ఎస్ఎంబీ29'. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వేంచర్ ఫిల్మ్ ఇది. ఇండియానా జోన్స్ తరహాలో ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రెండేళ్లు ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ జక్కన్న మాత్రం అంతకంతకూ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మరోవైపు ప్రాజెక్ట్ పై మరింతగా ఆసక్తిని పెంచుతున్నారు.

SS Rajamouli Mahesh Babu s SSMB29 Project Shooting in Restart again

2025 జనవరి 2న ఎస్ఎస్ఎంబీ29 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందని తెలుస్తోంది. కానీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం జరగలేదు. ఆ తర్వాత వెంటనే జక్కన్న మహేశ్ బాబును, ప్రధాన తారాగణాన్ని సెట్స్ లోకి రప్పించి వారి డేట్స్ ను లాక్ చేసినట్టు చెప్పే ఓ ట్వీట్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హైదరాబాల్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్స్ మధ్య షూటింగ్ కొనసాగుతోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడుతున్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నదన్న విషయం తెలిసిందే. ఇలా షూట్ ప్లాన్ చేయగానే ప్రియాంక చోప్రా కారణంగా కొంత బ్రేక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె సోదరుడి పెళ్లికి హాజరవడమే అందుకు రీజన్. అలాగే ఎస్ఎస్ రాజమౌళికి దగ్గరి బంధువు ఒకరు మరణించడంతో కుటుంబ సభ్యులంతా ఆ కార్యక్రమాలకు హాజరయ్యారంట. ఇలాంటి అనివార్య కార్యక్రమాలతో ఎస్ఎస్ఎంబీ షూటింగ్ కు కాస్తా బ్రేక్ పడింది. వారం గ్యాప్ తర్వాత మళ్లీ షూటింగ్ ను ఇవ్వాళ ప్రారంభించారు.

SS Rajamouli Mahesh Babu s SSMB29 Project Shooting in Restart again

ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ ఈచిత్రంలో మహేశ్ బాబు సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రియాంక చోప్రా కూడా మహేశ్ కు జోడీగానే నటిస్తున్నదని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో జక్కన్న ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి. అలాగే బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే హాలీవుడ్ తారలూ మెరవబోతున్నారు.

ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. స్పెషల్ సెట్స్ లో చిత్రీకరణ జరుగుతుంది. షూటింగ్ స్పాట్ లో ఎస్ఎస్ రాజమౌళి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే చిత్రానికి సంబంధించిన ఎలాంటి లీక్ కూడా బయటికి వెళ్లకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారని, ఫుల్ సెక్యూరిటీతో చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరణవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X