ప్రభాస్‌తోనా? మహేష్‌బాబుతోనా? RRR తర్వాత మూవీపై రాజమౌళి క్లారిటీ
RRR సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించే సినిమా ఏమిటనేది గత కొద్దికాలంగా చర్చ జరుగుతున్నది. అయితే కొందరు ప్రభాస్‌తో అని, మరికొందరు మహేష్‌బాబుతో అనే వాదిస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ టెలివిజన్ చర్చలో లైవ్‌లో మాట్లాడుతూ.. RRR తర్వాత తన విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకు రాజమౌళి ఎవరితో సినిమా చేస్తున్నారంటే..
Recommended Video

కేఎల్ నారాయణతోనే మూవీ
RRR తర్వాత ప్రభాస్‌తో చేస్తున్నారా? లేక మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అందులో రూమర్ ఏమిలేదు. ఇద్దరు నిర్మాతలతో కమిట్ అయ్యాను. అందులో ఒకరు డీవీవీ దానయ్య కాగా, మరోకరు నిర్మాత కేఎల్ నారాయణ. ప్రస్తుతం డీవీవీ దానయ్యతో RRR సినిమా చేస్తున్నందున ఆ తర్వాత నారాయణతో సినిమా చేస్తాను అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

మహేష్ బాబుతోనే మూవీ
అలాగే నారాయణతో చేసే సినిమా ప్రభాస్‌తో కాదు.. మహేష్ బాబుతోనే ఉంటుంది అని రాజమౌళి తన తదుపరి సినిమాపై వస్తున్న రూమర్లకు బ్రేక్ వేశారు. ఎప్పటి నుంచో నేను నారాయణ, మహేష్ బాబు కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని చెబుతున్నాను. కాబట్టి RRR మూవీ పూర్తి కాగానే మహేష్‌తో సినిమా మొదలవుతుందని చెప్పారు.

చాలా ఏళ్లుగా సినిమాలకు దూరం
టాలీవుడ్‌లో చాలా ఏళ్లుగా కేఎల్ నారాయణ సినీ నిర్మాణాలకు దూరంగా ఉన్నారు. అయితే రాజమౌళితో సినిమా చేయాలనే పట్టుదలతోనే ఆయన వేచి చూస్తున్నారనే విషయం మీడియాలో కొంత కాలంగా నానుతున్నది. కాబట్టి తాజాగా రాజమౌళి ప్రకటనతో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది.

RRR పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి
ప్రస్తుతం RRR మూవీ షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ వర్క్ చాలా వేగంగా జరుగుతున్నది. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడం వల్ల రిలీజ్ డేట్‌ను వచ్చే సంక్రాంతికి మార్చారు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్ కొనసాగడంతో షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను రాజమౌళి చేస్తున్నారనే విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











