SS రాజమౌళి దంపతులకు ఆస్కార్ ఆహ్వానం.. దర్శక ధీరుడికి అరుదైన గౌరవం

తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా దర్శకుడు రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యులుగా వారిని ఎంపిక చేయడం విశేషంగా మారింది. దేశం నుంచి అత్యుత్తమ గౌరవం పొందిన వారిలో ఒకరిగా చేరారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ అవార్డులు అందజేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తుంది. అందులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాపులర్ సిని సెలబ్రిటీలకు చోటు ఇస్తారు. ప్రతీ ఏటా వివిధ దేశాలు, భాషల నుంచి ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల సభ్యులుగా ఎస్ఎస్ రాజమౌళి, రమా రాజమౌళికి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఆహ్వానం పంపారు

SS Rajamouli Rama Rajamouli Shabhana Azmi Ritesh Sidwani gets invitation for Oscars 2025

ఇక ఇండియా నుంచి ఆ గౌరవం, ఆహ్వానం అందుకొన్న వారిలో షబానా ఆజ్మీ, బాలీవుడ్ నిర్మాత రితేష్ సిద్వానీకి కూడా ఉన్నారు. దేశ సినీ పరిశ్రమకు విశేషంగా సేవ చేస్తున్న వీరికి సముచిత గౌరవం దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రతీ ఏటా అకాడమీ ఆఫ్ మోహన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ సుమారు 487 మంది సభ్యులకు అవకాశం కల్పిస్తారు. సినీ పరిశ్రమలో వివిధ రంగాలు, విభాగాలకు చెందిన వారికి సముచిత గౌరవం కల్పిస్తారు. ఈ క్రమంలోనే ఇండియా నుంచి దర్శకుల విభాగంలో రాజమౌళి, క్యాస్టూమ్ డిజైనింగ్ విభాగంలో రమా రాజమౌళికి, నిర్మాతగా రితేష్, నటిగా షబానా ఆజ్మీకి ఈ ఆహ్వానం అందింది.

గతేడాది జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR మూవీకి అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ఈ ఘనత భారతీయుంందరికి ఆనందాన్ని కల్పించింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరో మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X