SS Rajamouli Review on Mem Famous యూత్‌ను ఎంకరేజ్ చేయండి.. దమ్ దమ్ చేయకండి అంటూ జక్కన్న ట్వీట్

తెలుగు సినిమా పరిశ్రమలో 50 మందికిపైగా కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన మేమ్ ఫేమస్ చిత్రం యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొంటున్నది. నూతన దర్శకుడు సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహించడమేకాకుండా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించింది. మే 26న రిలీజైన ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ సినిమా తాజాగా స్పందించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ వివరాల్లోకి వెళితే..

ప్రమోషన్స్‌తో అంచనాలు పెంచి: మేమ్ ఫేమస్ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్ కొత్తగా ఉండటంతో మూవీపై క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు మేమ్ ఫేమస్ యూనిట్‌తో కలిసి బ్యాండ్ డైలాగ్స్‌తో సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకొనే ప్రయత్నం జరిగింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

SS Rajamouli Review on Sumanth Prabhass Mem Famous movie: RRR director tweet goes viral

మహేష్ బాబు ట్వీట్ వైరల్: మేమ్ ఫేమస్ సినిమా రిలీజ్‌కు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ సినిమాను చూశాను. ఈ చిత్రంలో నటించిన కొత్త యువ నటీనటులు చాలా బాగా యాక్టింగ్ చేశారు. వీరందరిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారని ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేష్ బాబు ట్వీట్‌తో మేమ్ ఫేమస్ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.

SS Rajamouli Review on Sumanth Prabhass Mem Famous movie: RRR director tweet goes viral

ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్‌తో: ఇదిలా ఉండగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మేమ్ ఫేమస్ టీమ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ వేశారు. ఆస్కార్ అవార్డు సాధించిన RRR మూవీ దర్శకుడు ప్రశంసలు వ్యక్తం చేయడంతో మరోసారి ఈ సినిమాపై అందరి దృష్టిపడింది. ఈ సినిమాలోని నటీనటులను, అంజి మామపై తన ట్వీట్‌లో ప్రశంసలు గుప్పించారు.

SS Rajamouli Review on Sumanth Prabhass Mem Famous movie: RRR director tweet goes viral

యూత్‌ను ఎంకరేజ్ చేయండి అంటూ: ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేస్తూ.. థియేటర్‌లో చాలా రోజుల తర్వాత నేను సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో నటించిన సుమంత్ ప్రభాస్‌ను గుర్తుపెట్టుకొండి. తెలుగు సినిమా పరిశ్రమలో యాక్టర్, డైరెక్టర్‌గా మంచి భవిష్యత్ ఉంది. అంజి మామ తన యాక్టింగ్‌తో ఆకట్టుకొన్నాడు. ప్రతీ ఒక్కరు కూడా అతడికి అవకాశం ఇవ్వాలని నా సలహా. యూత్‌ను ఎంకరేజ్ చేయాలి. దమ్ దమ్ చేయొద్దు అంటూ మేమ్ ఫేమస్ సినిమాలోని డైలాగ్‌తో రాజమౌళి ట్వీట్ చేశారు.

SS Rajamouli Review on Sumanth Prabhass Mem Famous movie: RRR director tweet goes viral

మూడు రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్లు: ఇక మేమ్ ఫేమస్ సినిమా విషయానికి వస్తే.. మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీగా కలెక్షన్లను సాధిస్తున్నది. భారీ చిత్రాల పోటీ తట్టుకొని ఈ సినిమా వసూళ్లను నమోదు చేసింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 3.1 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాను ప్రశంసిస్తూ.. నటీనటులను ప్రోత్సాహించాలని ట్వీట్ చేయడం పాజిటివ్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X